Suma: సుమకు అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించిన హీరో.. ఎవరో తెలుసా?

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ ఒకరు. సుమ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా ఈవెంట్లు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలతో కూడా ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది.ఇలా ఇండస్ట్రీలో సుమకు మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు.

ఇలా సుమ నాని మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే సుమను ఆట పట్టించడం కోసం నాని ఓ రోజు అర్ధరాత్రి సమయంలో సుమకు ఫోన్ చేసి తనని విసిగించారట. ఈ విధంగా సుమకు ఫోన్ చేసిన నాని తనని గుర్తుపట్టకుండా గొంతు మార్చి మాట్లాడుతూ మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్గా తీసుకోవాలి అనుకుంటున్నాము మీరు అయితేనే చాలా బాగుంటుంది అయితే మీకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వమని ఫ్రీగా నటించాలని చెప్పారట.

ఈ మాటలు విన్నటువంటి సుమ (Suma) తన వాయిస్ గుర్తుపట్టకపోవడంతో ఎవరోనని ఫోన్ తీసుకెళ్లి తన భర్త రాజీవ్ కనకాలకు ఇచ్చారట అయితే ఆయన ఫోన్ మాట్లాడుతూ నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్ బే అంటూ తనకుస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా రాజీవ్ ఒక్కసారిగా మాట్లాడటంతో దెబ్బకు నాని ఫోన్ పెట్టేసారట. అయితే తిరిగి నాని ఫోన్ చేసి తనకు ఫోన్ చేసింది నేనేనని సరదాగా చేసానని చెప్పారట.

ఇలా నాని సరదాగా తనను ఆటపట్టించడం కోసం ఫోన్ చేయడంతో రాజీవ్ తనకు వార్నింగ్ ఇచ్చారంటూ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే ఈ వార్తలపై నాని లేదా సుమ స్పందించాల్సి ఉంది.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే… దసరా సినిమాతో సక్సెస్ అందుకున్నటువంటి నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus