బాలీవుడ్ మీడియాపై మండిపడ్డ స్టార్ హీరో!

బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఆ తరహా సినిమాల్లోనే నటిస్తున్నారు. ‘సత్యమేవ జయతే 2’ సినిమా తరువాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఎటాక్’. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.

Click Here To Watch NOW

ఈ క్రమంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో జాన్ అబ్రహం ఆగ్రహానికి లోనై రిపోర్టర్స్ పై మండిపడ్డారు. ఇంటర్వ్యూలో భాగంగా ఓ జర్నలిస్ట్ ‘మీ సినిమాల్లో యాక్షన్ ఓవర్ డోస్ ఉంటుంది. మీరు నలుగురైదుగురితో ఫైట్ చేస్తుంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం, బైక్ లను విసిరేయడం, మీ చేతులతో ఫ్లైట్స్ ని ఆపడం వంటివి చూస్తే కొంచెం అతిగా అనిపిస్తుంటుంది’ అని అన్నారు.

దీంతో జాన్ అబ్రహంకి కోపమొచ్చింది. ‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు’ అని సదరు జర్నలిస్ట్ ని అడగ్గా.. ‘సత్యమేవ జయతే’ గురించి అని బదులిచ్చాడు. దానికి జాన్ అబ్రహం ‘నేను ఎటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో మీకేమైనా సమస్య ఉంటే నన్ను క్షమించింది’ అంటూ వెటకారంగా రియాక్ట్ అయ్యాడు. అంతేకాదు ఫిట్ నెట్ గురించి అడిగిన ప్రశ్నకు మరింత వెటకారంగా బదులిచ్చాడు. ‘శారీరంగా ఫిట్ గా ఉండడం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తున్నాను.

క్షమించండి సార్.. మీరు మీ బ్రెయిన్ ని ఇంట్లో వదిలేసి వచ్చినట్లు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. నెక్స్ట్ టైమ్ బెటర్ గా చేయడానికి ప్రయత్నించండి’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు జాన్ అబ్రహం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus