Polimera Movie: సత్యం రాజేష్ కాదు.. ‘పొలిమేర’ లో ఫస్ట్ ఛాయిస్ అతనేనట..!

2021 లో పెద్దగా చప్పుడు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ ‘మా ఊరి పొలిమేర’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇదేదో ఓ గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా అయ్యుండొచ్చు అని అంతా మొదట అనుకున్నారు. కానీ బ్లాక్ మ్యాజిక్(చేతబడి) కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా అని తర్వాత తెలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అప్పటికి ‘కాంతార’ కూడా రాలేదు.

క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉంటుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ లతో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సినిమా ముగుస్తుంది. ఇక రెండేళ్ల తర్వాత దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తర్వాత ‘పొలిమేర 2’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. నవంబర్ 3 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన బన్నీ వాస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమా పై పడింది.

ఇది పక్కన పెడితే.. (Polimera) ‘పొలిమేర’ లో హీరో పాత్ర అనలేము కానీ మెయిన్ రోల్ మాత్రం ‘సత్యం’ రాజేష్..దే అని చెప్పాలి. అయితే ఈ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఇతను కాదట. మరో హీరో రిజెక్ట్ చేస్తే.. ఇతనికి వచ్చి పడింది. అతను మరెవరో కాదు ‘పలాస’ హీరో రక్షిత్ అట్లూరి. అవును ఇతను మూడేళ్లు కష్టపడి ‘నరకాసుర’ అనే సినిమా చేశాడు. దీని కోసమే ‘పొలిమేర’ లో ఛాన్స్ వస్తే వద్దనుకున్నాడట. విచిత్రం ఏంటి అంటే నవంబర్ 3 నే ‘పొలిమేర 2 ‘ ‘నరకాసుర’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus