‘ఆర్య’ (Aarya) ఓ కల్ట్ క్లాసిక్ మూవీ. ఆ టైంకి ఓ పాత్ బ్రేకింగ్ మూవీ కూడా. సుకుమార్ (Sukumar) ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ‘గంగోత్రి’ (Gangotri) తో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టినప్పటికీ అల్లు అర్జున్ కి (Allu Arjun) స్టార్ డం తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘ఆర్య’ అనే చెప్పాలి. ఇక ఓ కొత్త డైరెక్టర్, అప్ కమింగ్ హీరోతో కొంచెం పెద్ద సైజ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత నిర్మాత దిల్ రాజుకి (Dil Raju) కూడా దక్కుతుంది.
ఆయన్ని కూడా స్టార్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టిన సినిమా ఇది అని చెప్పవచ్చు. అలా ఈ ముగ్గురికీ స్టార్ డంని కట్టబెట్టిన ‘ఆర్య’ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటితో అంటే మే 7 తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2004 మే 7న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ‘ఆర్య’ సినిమా. అల్లు అర్జున్ కి కూడా ఆ టైంలో పెద్దగా ఇమేజ్ లేదు. అయినప్పటికీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా మేనియాలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా కొట్టుకుపోయాయి అనే సంగతి మీకు తెలుసా? వినడానికి కష్టంగా ఉన్నా..
ఇది నిజం. ‘ఆర్య’ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత అంటే మే 14 న మహేష్ బాబు (Mahesh Babu) ‘నాని’ (Naani) సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి ప్లాప్ టాక్ వచ్చింది. ఇంకో పక్క ‘ఆర్య’ పోటీని తట్టుకోవడం కూడా కష్టమైంది. ‘ఒక్కడు’ (Okkadu) వంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు సినిమా అల్లు అర్జున్ సినిమా పక్కన చతికిల పడిపోయింది. ఇక ఆ తర్వాతి వారానికి అంటే మే 21 కి ప్రభాస్ (Prabhas) ‘అడవి రాముడు’ (Adavi Ramudu) రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా కూడా ‘ఆర్య’ పక్కన నిలబడలేకపోయింది. ‘వర్షం’ (Varsham) తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమా .. అల్లు అర్జున్ వంటి అప్ కమింగ్ హీరో ముందు నిలబడలేక ప్లాప్ అయ్యింది. అంతేకాదు ‘ఆర్య’ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్ 9న రిలీజ్ అయిన ఎన్టీఆర్ (Jr NTR) -వినాయక్ (V. V. Vinayak) ..ల ‘సాంబ’ (Samba) సినిమాని సైతం ‘ఆర్య’ డామినేట్ చేసింది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ‘ఆర్య’ సినిమా వంద రోజుల వరకు హౌస్ ఫుల్స్ పడ్డాయి ఆ రోజుల్లో..!