RRR Movie : ఆర్ఆర్ఆర్ సీత రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

  • June 12, 2021 / 07:58 PM IST

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఆర్ఆర్ఆర్ కావడం గమనార్హం. బాహుబలి2 వరకు తన సినిమాల్లో తెలుగులో గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లకే ఛాన్స్ ఇచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం రూటు మార్చారు. అలియా భట్ తనకు ఛాన్స్ ఇవ్వాలని రాజమౌళిని కొన్నేళ్ల క్రితం కోరగా జక్కన్న చరణ్ కు జోడీగా సీత పాత్రను అలియా భట్ కు ఆఫర్ చేశారు.

అయితే ఈ పాత్ర కోసం అలియా భట్ పది కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అలియా భట్ ఈ సినిమా కోసం 6 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ అయితే షూటింగ్ లో పాల్గొనడానికి అలియా భట్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన వెంటనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ మరింత పెరగడానికి అలియా భట్ కూడా కారణమని చెప్పవచ్చు. సినిమాలో అలియా భట్ పాత్ర పరిధి తక్కువే అయినా అలియా పాత్ర కథను కీలక మలుపులు తిప్పుతుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి వార్తలు వైరల్ అవుతున్నా రాజమౌళి మాత్రం చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus