Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ అండతో చెలరేగి పోతున్న హౌస్ మేట్స్..! ఈవారం ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే.?

  • September 23, 2023 / 11:04 AM IST

వడ్డించే వాడు మనవాడు అయితే ఎక్కడుంటే ఏంటి అనేది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ కి ఖచ్చితంగా సరిపోతుంది. బిగ్ బాస్ మేనేజ్ చేసేదే మనోళ్లు అనే ధీమాతో హౌస్ లోకి అడుగుపెట్టారు స్టార్ మా బ్యాచ్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకొచ్చింది. నిజంగా కావాలని బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడా అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే., ఫస్ట్ వీక్ లో సందీప్ ఇంకా ప్రియాంక ఇద్దరూ 5 వారాల ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేశారు.

ఇది కంప్లీట్ గా హౌస్ మేట్స్ (Bigg Boss 7 Telugu) ఓటింగ్ తోనే సాగింది. హౌస్ మేట్స్ ఈ ఇద్దరినీ నెక్ట్స్ లెవల్ కి పంపారు. ఆ తర్వాత 4 వారాల ఇమ్యూనిటీలో కూడా అమర్ దీప్ ని కావాలని బిగ్ బాస్ తీస్కుని వచ్చినట్లుగానే ఉంది. సందీప్ కి లేని పోని పవర్ ఇచ్చి అమర్ ని రేస్ లో నిలిపాడు. ఇప్పుడైతే ఏకంగా ప్రిన్స్ ని తప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. దీనికోసం పోటీదారుల మద్యలో చిచ్చు పెట్టాడు.

ముగ్గురిలో ఏకాభిప్రాయానికి రావాలంటే ఖచ్చితంగా ఒకర్ని ఎలిమినేట్ చేయాలంటే అది ప్రిన్స్ నే చేస్తారని ముందుగానే గ్రహించిని బిగ్ బాస్ టీమ్ కావాలనే ప్రిన్స్ ని ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శోభాశెట్టి ఇంకా ప్రియాంక ఇద్దరి మద్యలో పెట్టిన గేమ్ కూడా బిగ్ బాస్ టీమ్ వాళ్లని నచ్చిన వాళ్లకి ఇవ్వచ్చనే ఉద్దేశ్యంతోనే పెట్టారు. ఇక బిగ్ బాస్ ప్రతిసారి వాళ్లకి ఛాన్స్ ఇస్తుంటే స్టార్ మా బ్యాచ్ చెలరేగిపోతున్నారు.

నిజానికి హీరో శివాజీ బెడ్ రూమ్ లో వీళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు స్టార్ మా బ్యాచ్ బెడ్ రూమ్ లో ఉన్నారా అంటూ మాట్లాడాడు. అప్పట్నుంచీ స్టార్ మా బ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అలాగే బిగ్ బాస్ కూడా వీరిపై పెద్ద కన్నే వేసి పెద్ద చూపు చూస్తున్నాడు. అందుకే, ఇప్పుడు వీళ్ల డామినేషన్ హౌస్ లో ఎక్కువైపోయింది. ఇక ఈవారం అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో థామిని ఇంకా శుభశ్రీ లీస్ట్ లో ఉన్నారు.

ఇంకా వీరితో పాటుగా డేంజర్ జోన్ లో ప్రియాంక , రతిక కూడా ఉన్నారు. మరి వీళ్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ, బిగ్ బాస్ లో ఇప్పటికే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఇద్దరు వెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్లలో ఎవరిని ఇంటికి పంపినా కూడా బిగ్ బాస్ లో లేడీస్ బ్యాచ్ తగ్గిపోతారు. కాబట్టి ఒక మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ చూస్తోంది. మరి అదే జరిగితే, గౌతమ్ లేదా ప్రిన్స్ యావార్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus