గత దశాబ్దన్నర కాలంలో టాలీవుడ్ లో లెక్కలేనన్ని సినిమాలు చేశారు నటుడు షాయాజీ షిండే. ఇప్పుడు ఆయన వివాదంలో చిక్కుకున్నారు. అతనిపై మరాఠీ నిర్మాత సచిన్ సనన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సినిమాలో నటించేందుకు రూ.5 లక్షలు తీసుకొని.. చివరికి హ్యాండ్ ఇచ్చినట్లు సచిన్ సనన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా షాయాజీ షిండే కారణంగా రూ.17 లక్షలు నష్టపోయినట్లు నిర్మాత చెబుతున్నారు. మరాఠీ సినిమా ‘గిన్నాద్’లో ఒక రోల్ కోసం షాయాజీ షిండేని సంప్రదించగా..
కథ విన్న అతడు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. కానీ అతడు ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ కి రాలేదని నిర్మాత వెల్లడించారు. కారణం అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు సదరు నిర్మాత. ఆ తరువాతి రోజు షూటింగ్ కి వచ్చి స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సెట్ లో గొడవ పడినట్లు సచిన్ పేర్కొన్నారు. సినిమాలో నటించడానికి షాయాజీ షిండేకి రూ.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చానని..
అతడు షూటింగ్ కి రాకపోవడం, సెట్ నుంచి వెళ్లిపోవడంతో మొత్తంగా రూ.17 లక్షల వరకు నష్టపోయినట్లు సచిన్ సనన్ చెప్పుకొచ్చారు. ఈ మొత్తాన్ని షాయాజీ షిండే నుంచి ఇప్పించాలని నిర్మాత కోరుతున్నారు. పోలీస్ కంప్లైంట్ చేయడంతో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మొదట ఈ విషయాన్ని మాటలతోనే పరిష్కరించుకోవాలని నిర్మాత భావించారట. కానీ షాయాజీ షిండే ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం..
వేరే వ్యక్తి ద్వారా అడిగితే సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటివి చేయడంతో కంప్లైంట్ ఇవ్వక తప్పడం లేదని నిర్మాత తెలిపారు. మరి ఈ విషయంపై షాయాజీ షిండే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!