Star Producer: సినీ పరిశ్రమలో మరో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత.!
- April 29, 2023 / 12:47 PM ISTByFilmy Focus
సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ నెలలో ఆల్రెడీ కమెడియన్ అల్లు రమేశ్, కొరియన్ పాప్ సింగర్ అలాగే నటుడు అయిన మూన్ బిన్, బాలీవుడ్ స్టార్ సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా,చెర్రీ (చిరంజీవి) తల్లి , అలాగే మలయాళం కమెడియన్ మాముకోయ కూడా మరణించడం జరిగింది. ఈ విషాదాలతో వీరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పాలి. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఈరోజు కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే..కోలీవుడ్ (Star Producer) నిర్మాత ఎస్ఎస్ చక్రవర్తి శనివారం నాడు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఈయన నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. అలాంటి చక్రవర్తి కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రెండు రోజుల నుండి ఈయన పరిస్థితి విషమంగా మారడంతో దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఈ క్రమంలో ఆయన శనివారం నాడు ఉదయం తుది శ్వాస విడిచినట్టు సమాచారం. 1997 లో ‘రాశి’ అనే చిత్రం ద్వారా నిర్మాతగా మారారు చక్రవర్తి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ఈయన వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ వంటి చిత్రాలను రూపొందించారు. మరో స్టార్ హీరో శింబుతో కూడా కాలై, వాలు వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ఈయన మరణవార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా














