బాహుబలి రెండు పార్ట్ లకు మధ్య స్టార్స్ ఎన్ని సినిమాలు చేశారు ?

బాహుబలి చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ మూవీ రెండు పార్ట్ లు పూర్తికావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. నటులకు ఈ సమయం చాలా కీలకం. అందుకే ఒక్క ప్రభాస్ తప్ప మిగిలిన వారందరూ బాహుబలి 2 లో నటిస్తూనే మరికొన్ని సినిమాలు పూర్తి చేశారు. బాహుబలి రిలీజ్ అయిన తరవాత ఆ స్టార్స్ చేసిన సినిమాలపై ఫోకస్..

అనుష్క బాహుబలి లో దేవసేనగా నటించిన అనుష్క .. బిగినింగ్, కంక్లూజన్ కి మధ్య ఐదు సినిమాలు చేసింది. ఊపిరిలో కాసేపు కనిపించిన స్వీటీ.. రుద్రమదేవి, సైజ్జీరో లో టైటిల్ రోల్ పోషించింది. సింగం త్రీ లో హీరోయిన్ గా నటించిన అనుష్క.. ఓం నమో వెంకటేశాయలో భక్తురాలిగా మెప్పించింది.

రానా బాహుబలి చిత్రంలో ప్రభాస్ తర్వాత సినిమాలో ఎక్కువ సేపు కనిపించే నటుడు రానా. ఇతను రెండు పార్ట్ ల గ్యాప్ లో హీరోగా ఘాజీ సినిమాను చేయగా, రుద్రమదేవిలో చాళుక్య వీరభద్రగా చక్కగా నటించారు. ఈ రెండు సినిమాలు రానా కి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

తమన్నా బాహుబలిలో సౌందర్య రాసి అవంతికగా తమన్నా నటించింది. డ్యాన్సులు కాదు ఫైట్స్ కూడా అదరకొడతానని నిరూపించింది. బిగినింగ్ తర్వాత తమన్నా స్పీడున్నోడు, జాగ్వార్ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఊపిరి, బెంగాల్ టైగర్ లో హీరోయిన్ గా అలరించింది. ఇక బాలీవుడ్ లోను తమన్నా రెండు సినిమాలు చేసింది.

రమ్యకృష్ణ రాజమాత శివగామిగా రమ్యకృష్ణ బాహుబలిలో బలమైన పాత్ర పోషించింది. బాహుబలి రిలీజ్ అయిన అనంతరం మామ మంచు అల్లుడు కంచు, సోగ్గాడే చిన్ని నాయనలో నటించింది. తమిళంలో శెభాష్ నాయుడు లోను కీలక రోల్ పోషిస్తోంది. అయితే ఆ సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది.

నాజర్ శివగామి భర్త బిజ్జలదేవ గా నాజర్ తన అనుభవాన్నంతటిని రంగరించి తెరపైన ప్రదర్శించారు. బాహుబలి 1 విడుదల తరవాత నాజర్… కాటమరాయుడు, ధృవ , ఖైదీ నెంబర్ 150, ఘాజి ఎటాక్, మనమంతా , బ్రహ్మోత్సవం, టెర్రర్, గరం, సోగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్, కొరియర్ బాయ్ కళ్యాణ్ .. పదికి పైగా సినిమాల్లో కనిపించారు.

సత్యరాజ్ బాహుబలి సత్యరాజ్ ని కట్టప్పగా మార్చివేసింది. అందరికీ కట్టప్పగానే ముద్రపడిపోయారు. బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ మధ్యలో ఈయన నటించిన నేను శైలజ, బ్రహ్మోత్సవం , హైపర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అడవి శేష్భల్లాల దేవా తనయుడు భద్రగా అడవి శేష్ బాహుబలిలో నటించారు. బాహుబలి బిగినింగ్ తర్వాత అడవి శేష్ క్షణం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దొంగాట మూవీలోనూ నటించి అభినందనలు అందుకున్నారు.

రోహిణి శివుడిని పెంచిన తల్లిగా రోహిణి నటించారు. బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయ్యేలోపున నేను శైలజ, జెంటిల్ మ్యాన్ సినిమాల్లో రోహిణి నటించి మెప్పించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus