చిరంజీవి నుండి ధనుష్ వరకు ‘సార్’ అని పిలిపించుకున్న 10 మంది హీరోలు ఎవరంటే..?

తప్పు చేస్తే క్లాస్ తీసుకోవడం.. చెప్పిన పాఠాన్ని పాటించకపోతే గుణపాఠాలు నేర్పడం.. చదువు చెప్పడం.. మంచిని పంచడం.. దాన్ని ఆచరణలో పెట్టేలా చూడడం.. ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది.. భావితరాలకు బంగారు భవిష్యత్తుని అందించడానికి అహర్నిశలూ శ్రమిస్తుంటారు ఉపాధ్యాయులు.. అందుకే తల్లీదండ్రీ, తర్వాత గురువు, దైవం అంటారు.. రియల్ లైఫ్‌లో పాఠాలు నేర్చుకున్న మన సౌత్ స్టార్స్.. రీల్ లైఫ్‌లో పుస్తకం పట్టి పాఠాలు చెప్పి.. ప్రేక్షకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు.. ఎన్టీఆర్ ‘బడిపంతులు’ నుండి తర్వాత పలువురు హీరోలు క్లాసులు చెప్పారు.. మెగాస్టార్ చిరంజీవి నుండి అలా క్లాస్ తీసుకున్న కథానాయకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) చిరంజీవి – మాస్టర్..

మాస్‌కి పెట్టింది పేరు అయిన చిరంజీవి.. కళ్లద్దాలు పెట్టుకుని డిఫరెంట్ లుక్‌లో ‘మాస్టర్’ రాజ్ కుమార్ క్యారెక్టర్లో అదరగొట్టేశారు.. రోషిణి, సాక్షి శివానంద్ కథానాయికలు.. ‘భాషా’ ఫేమ్ సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో సూపర్ హిట్‌గా నిలిచింది..

2) బాలకృష్ణ – సింహా..

 

నటసింహ నందమూరి బాలకృష్ణ క్లాస్‌గా కనిపిస్తూ.. తప్పుదోవ పడుతున్న స్టూడెంట్స్‌ని సరిచెయ్యడానికి మాస్ పద్ధతిని వాడే శ్రీమన్నారాయణ అనే లెక్చరర్ పాత్రలో ఇరగదీశారు..

3) వెంకటేష్ – సుందరకాండ..

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ‘సుందరకాండ’ స్పెషల్ మూవీ.. లెక్చరర్‌తో స్టూడెంట్ ప్రేమాయణం.. తర్వాత జరిగే పరిణామాలు ఆకట్టుకుంటాయి.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

4) జగపతి బాబు – మూడుముక్కలాట..

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు.. జగపతి బాబుని ‘మూడుముక్కలాట’ లో లెక్చరర్‌గా చూపించారు.. పేరుకి తగ్గట్టే.. సౌందర్య, రంభ, రాశి వంటి ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రేమాయణం.. దాని వల్ల మాస్టర్ పడే ఇబ్బందులు ఫన్నీగా అనిపిస్తాయి..

5) రవితేజ – మిరపకాయ్..

మాస్ మహారాజా రవితేజను ‘మిరపకాయ్’ మూవీలో లెక్చరర్‌ని చేశారు హరీష్ శంకర్.. కాలేజీ సమస్యలను తీరుస్తూనే తను వచ్చిన పని చక్కబెట్టుకుంటాడు.. కథానాయికలతో ప్రేమాయణం, రవితేజ మార్క్ కామెడీ ఆకట్టుకుంటాయి..

6) విజయ్ దేవరకొండ – గీత గోవిందం..

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ లో కాసేపు లెక్చరర్‌గా కనిపిస్తాడు.. స్టూడెంట్ ప్రేమ పేరుతో వేధిస్తుంటే ఎస్కేప్ అవడానికి తిప్పలు పడుతుంటాడు..

7) కమల్ హాసన్ – ప్రొఫెసర్ విశ్వం..

విశ్వనటుడ కమల్ హాసన్ హిస్టరీ ప్రొఫెషర్‌గా నటించిన తమిళ్ ఫిలిం.. ‘నమ్మవర్’ (Nammavar).. గౌతమి కథానాయిక.. కె.ఎస్. సేతు మాధవన్ డైరెక్ట్ చేయగా.. కమల్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు.. ఈ సినిమా మూడు నేషనల్ అవార్డ్స్‌తో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులు గెలుచుకుంది.. తెలుగులో ‘ప్రొఫెసర్ విశ్వం’ పేరుతో డబ్ చేశారు..

8) మమ్ముట్టి – టీచర్ / కాలేజ్ ప్రొఫెసర్..

 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పలు చిత్రాల్లో టీచర్ / కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలు చేశారు.. ‘అనుబంధం’ (1985), మజయేతుం మున్పే (1995) తనియావర్థనం (1997), ‘మాస్టర్ పీస్’ (2017) (ఫేక్ ప్రొఫెసర్) వంటి సినిమాల్లో పాఠాలు చెప్పారు..

9) మోహన్ లాల్..

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా వెండితెర మీద విద్యార్థులకు విద్యబుద్దులు చెప్పారు.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘వెలిపాడింటే పుస్తకం’ సినిమాల్లో ఆయన ప్రొఫెసర్‌గా కనిపించారు..

10) ధనుష్ – సార్..

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ‘సార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.. తమిళంలో ‘వాతి’ గా విడుదలైంది.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు.. రెండు భాషల్లోనూ డీసెంట్ హిట్ సాధించింది ‘సార్’..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus