ప్రమోషన్స్ ఓకే.. రిలీజ్ డేట్ సంగతేంటి?

నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య వంటి వారు నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. ‘ఎఫ్2’ తో వెంకటేష్.. ‘మజిలీ’ తో నాగచైతన్య బ్లాక్ బస్టర్లు కొట్టి మంచి ఫామ్లో ఉండడంతో ‘వెంకీమామ’ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక నవంబర్ 7న ఫస్ట్ లిరికల్ విడుదల చేస్తున్నట్టు కూడా నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తమన్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది కానీ ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో మాత్రం నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం లేదు.

మొదట ఈ చిత్రాన్ని దసరా కి విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.. తరువాత దీపావళి టైములో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇక డిసెంబర్ లో విడుదల చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. తరువాత 2020 సంక్రాంతికి అన్నారు దాని పై కూడా క్లారిటీ రాలేదు. అసలు ఎప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు అనేది మాత్రం తెలీడం లేదు. అయితే ‘వెంకీమామ’ చిత్రం కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు చేశారట నిర్మాతలు. అయితే అంత పెద్ద మొత్తం వెనక్కి రాబట్టాలి అంటే.. సోలో రిలీజ్ అవసరం. అందుకే ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు నిర్మాతలు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus