Kantara: అల్లు అరవింద్ డీల్ దెబ్బ కొట్టింది!

కొన్నిరోజుల క్రితం కన్నడలో విడుదలైన ‘కాంతారా’ అనే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి వచ్చిన టాక్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూడాలనుకున్నారు. వారి కోసం ‘కాంతారా’ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చూసి ఆయనకి భారీ లాభాలు వస్తున్నాయని అందరూ అనుకున్నారు.

కానీ నిజానికి ఈ సినిమాతో అల్లు అరవింద్ కి మిగిలిందేమీ లేదని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. గీతాఆర్ట్స్ సంస్థలో కీలక వ్యక్తి, నిర్మాత బన్నీ వాసు ‘కాంతారా’ సినిమాను చూశారు. తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని భావించారు. అల్లు అరవింద్ కి విషయం చెప్పి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునేలా చేశారు. తెలుగులో సినిమాను విడుదల చేయడానికి అంగీకరించారు కానీ.. రైట్స్ మొత్తం కొనలేదట. సినిమాను కమీషన్ పద్దతిలో విడుదల చేసేలా మాట్లాడుకున్నారట.

ఆ డీల్ ప్రకారం… తెలుగులో వస్తోన్న కలెక్షన్స్ మొత్తం గీతాఆర్ట్స్ కి రావడం లేదు. అందులో కొంత అమౌంట్ కన్నడ నిర్మాతకు వెళ్తున్నాయి. మొత్తం తెలుగు వెర్షన్ రైట్స్ అల్లు అరవింద్ తీసుకొని ఉంటే బావుండేదని గీతాఆర్ట్స్ జనాలు ఫీల్ అవుతున్నారట. అల్లు అరవింద్ ‘కాంతారా’ హక్కులను మూడు కోట్లకు కొన్నారని.. ఆయనకు భారీ లాభాలు వస్తున్నాయని వస్తోన్న వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇక ‘కాంతారా’ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటించారు. విజయ్ కిరగందూర్ నిర్మాతగావ్యవహరించారు .

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus