‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’.. సరికొత్త ప్రమోషన్..!

అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. మంచి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అఖిల్ డ్యాన్సులు ఇరగదీస్తాడు .. ఫైట్ లు కూడా బాగా చేస్తాడు ఆ విషయంలో ఎక్కడా తీసిపోడు. మొదటి చిత్రం ‘అఖిల్’ నిరాశపరిచినప్పటికీ.. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించింది. ఇప్పటికీ డెబ్యూ హీరోగా ఎక్కువ మొదటిరోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన హీరోగా అఖిలే ఉన్నాడు. ఇక ‘హలో’ పర్వాలేదనిపించినప్పటికీ.. కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి కూడా అంతే..! ఈసారి మాత్రం అఖిల్ పెద్ద హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో తన 4వ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ రెండో సంస్థ అయిన ‘జిఏ2 పిక్చర్స్’ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లను ఇటీవల విడుదల చేశారు.

మొదటి ఫస్ట్ లుక్ లో ‘అత్తారింటికి దారేది’ స్టైల్ లో ఫుట్ వేర్ లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక రెండో లుక్ లో హీరోయిన్ పూజా హెగ్దే.. స్టాండ్ అప్ కమెడియన్ లా మైక్ ముందు నిలుచుని షూ స్ చూపెడుతుంది. ఈ పోస్టర్ లకి కొందరి నెటిజన్లు చేసిన కామెంట్స్ చాలా సరదాగా ఉన్నాయి. అవేంటంటే.. ‘పూజా హెగ్దే చేతిలో షూస్ ఉన్నాయి కాబట్టి.. అఖిల్ అందుకే అలా ఫుట్ వేర్ లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. అఖిల్ షూస్ ఈమెనే కొట్టేసింది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా ఈ రెండు పోస్టర్లకు లింక్ ఉందేమో.. అది తెలియాలంటే సినిమా వరకూ ఆగాలి. ఇక మరికొందరు.. ‘అత్తారింటికి దారి వెతుక్కుంటున్న మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా.. ఈ రెండు పోస్టర్ లతో మాత్రం ఆడియన్స్ అటెన్షన్ ను డ్రా చేశాయనే చెప్పాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus