టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాణంలో ‘శుభం’ (Subham) అనే సినిమా రూపొందింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హారర్ కామెడీ జోనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 9న విడుదల చేశారు. గవిరెడ్డి శ్రీనివాస రావు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో… రిలీజ్ కి 2 రోజుల ముందే ప్రిమియర్స్ వేశారు.
వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే వీక్ డేస్ లో ఈ సినిమా అనుకున్నట్టు రాణించలేదు. కానీ మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.75 cr |
సీడెడ్ | 0.19 cr |
ఉత్తరాంధ్ర | 0.86 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.23 cr |
ఓవర్సీస్ | 0.48 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.51 cr (షేర్) |
‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.2.51 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. గ్రాస్ పరంగా రూ.4.15 కోట్లు కలెక్ట్ చేసింది.