ముద్దుగుమ్మ డైరెక్షన్ లో బడా హీరో!

టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎక్కువ శాతం భామలు వచ్చామా…సంపాదించుకున్నామా…పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయామా అన్న ఫార్ములాతోనే తమ కరియర్ ను ముగించేసుకుంటున్నారు. అయితే అదే క్రమంలో అలాంటి భామల మధ్య మంచి ఆర్టిస్ట్ గా, మంచి హీరోయిన్ గా, మంచి నటిగా పేరు తెచ్చుకున్న భామ నిత్యా మీనన్. ఈ భామ హీరోయిన గా బిజీగా ఉంటూనే ఎప్పటికైనా మంచి దర్శకురాలిగా మారి సూపర్ హిట్ సినిమా తియ్యాలి అని ఆలోచన చేస్తుంది. అదే క్రమంలో దర్శకత్వంలో పట్టు పెంచుకునేందుకు అనేక ఆలోచనలు సైతం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ తనకు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు అని, అందులో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒకడు అని.

సుదీప్‌ని చూసిన ప్రతీసారి అతడి కోసం ఓ క్యారెక్టర్ రాయాలనిపిస్తుంటుంది అని తన మనసులో మాటని బయటపెట్టింది. సుదీప్ చాలా మంచి మనిషి. అతడిది మోటివేషనల్ క్యారెక్టర్. అందుకే అతడిని చూసినప్పుడల్లా ఏదో ఓ పాత్ర మదిలో మెదులుతుంటుంది. అలా ఇంకెవ్వరిని చూసినా అనిపించదు అని చెబుతోంది నిత్యా. అదే క్రమంలో తాను రాసిన కొన్ని కధలను సూధీప్ కి వినిపించగా చాలా బావున్నాయి డైరెక్షన్ చెయ్యవచ్చుగా అని తాను సలహా ఇచ్చాడు అని, ఒకవేళ నిజంగా దర్సకత్వమె చేస్తే అందులో సూధీప్ కు మంచి క్యారెక్టర్ ఉంటుంది అని తెలిపింది ఈ  భామా. అంటే మొత్తానికి సూధీప్ పై ఉన్న అభిమానంతో మన నిత్య మంచి కధ రెడీ చేస్తుంది అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus