ఇక్కడ కూడా రష్మీ ఎందుకు.. సుధీర్..!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులారిటీ సంపాదించున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో సుధీర్ ఒకడు. అయితే సుధీర్ కేవలం స్కిట్స్ తోనే కాదు యాంకర్ రష్మీతో డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలతో మరింత పాపులర్ అయ్యాడు. రష్మీ.. సుధీర్ కచ్చితంగా పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని వీళ్ళిద్దరూ కొట్టిపారేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ‘షో’లు చేస్తుండడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇదిలా ఉంటే.. సుధీర్ ఇప్పుడో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుధీర్.

సుధీర్ మాట్లాడుతూ.. ” ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే టైటిల్ కథను బట్టే పెట్టాము. కామెడీతో పాటు అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో వుంటాయి. ఇక నా పక్కన హీరోయిన్ గా ధన్యా బాలకృష్ణ నటించింది. ముందుగా ఈ పాత్ర కోసం దర్శక నిర్మాతలు రష్మినే సంప్రదించారు. కానీ అప్పటికే ఆమె వేరే సినిమాలు ఒప్పుకుని ఉండటంతో ఆమె రిజెక్ట్ చేసింది. ఈ సినిమాలో నేను రజనీ స్టైల్ ను .. పవన్ స్టైల్ ను అనుకరించిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా విడుదల కాబోతుంది’ అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ కూడా సుధీర్.. రష్మీ ప్రస్తావన తీసుకురావడంతో కొందరు నెటిజన్లు సుధీర్ పై సెటైర్లు వేస్తున్నాడు. ‘ఇక రష్మీ ని వదలవా.. భయ్యా?’ ‘ఇక్కడ కూడా రష్మీ టాపిక్ ఎందుకు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus