సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ అనే సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరియన్ రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి మరో కొరియన్ రీమేక్ ను ప్రొడ్యూస్ చేశారు. అదే ‘శాకిని డాకిని’. సౌత్ కొరియా యాక్షన్ కామెడీ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కి ఇది అఫీషియల్ రీమేక్.
ఇందులో రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్ పోషించారు. సుధీర్ వర్మ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అయితే ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా దర్శకుడు సుధీర్ వర్మ కనిపించడం లేదు. కనీసం ఈ సినిమాకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టడం లేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి..
సినిమా మేకింగ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. కొరియన్ స్క్రిప్ట్ ను ఉన్నది ఉన్నట్లుగా తీయమని ఆమె చెప్పారట. కథలో కొన్ని మార్పులు చేద్దామని సుధీర్ వర్మ సూచించినా.. నిర్మాత ఒప్పుకోలేదట. కొరియన్ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం తీయాలని ఆమె డిమాండ్ చేయడంతో సుధీర్ వర్మకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
తీరా అవుట్ పుట్ చూసుకున్న తరువాత సంతృప్తిగా అనిపించకపోవడంతో.. కొన్ని మార్పులు చేయమని సూచించారట సునీత. దానికి సుధీర్ వర్మ అంగీకరించలేదట. ఇక్కడే ఈగో క్లాషెస్ రావడంతో.. సునీత మరో దర్శకుడిని పెట్టి రీషూట్ చేయించారట. ఈ విషయం సుధీర్ వర్మకి తెలియడంతో ఇక సినిమాను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఆయన రవితేజ నటిస్తోన్న ‘రావణాసుర’ సినిమాతో బిజీ అయ్యారు.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర