Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’తో థియేటర్స్‌లో సందడి చేస్తాం – హీరో సుధీర్

త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’తో థియేటర్స్‌లో సందడి చేస్తాం – హీరో సుధీర్

  • November 8, 2023 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్వరలోనే  ‘కాలింగ్ సహస్త్ర’తో థియేటర్స్‌లో సందడి చేస్తాం – హీరో సుధీర్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. టీవీ షోస్‌లో న‌వ్వించిన సుధీర్ , గాలోడు చిత్రంలో మాస్ హీరోగా ఆక‌ట్టుకున్నారు. అయితే ఈసారి మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే.’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా…

సినిమాటోగ్రాఫర్ శశికిరణ్ మాట్లాడుతూ ‘‘త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’ చిత్రం విడుదలవుతుంది. సుధీరన్న చాలా కొత్తగా అందరినీ మెప్పిస్తారు’’ అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. చాలా మంచి వ్యక్తి. తనతో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కి కాస్త సమయం పట్టింది. కానీ.. అద్భుతమైన ఔట్ పుట్ వచ్చింది. ఎంటైర్ యూనిట్‌కి థాంక్స్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారు ఈ సినీ జర్నీలో నాకెంతో మంచి స్నేహితుడు అయ్యారు. కాలింగ్ సహస్త్ర మూవీలో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సబ్జెక్ట్‌ని బేస్ చేసుకుని మ్యూజిక్‌ని అందించాం. అన్నీ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. హీరోయిన్ డాలీషా తెలుగు నేర్చుకుని నటించారు. డైరెక్టర్ అరుణ్ గారికి, సినిమాటోగ్రాఫర్ సన్నిగారికి థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. సుద్దాలగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. మా నిర్మాతలకు స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. మాకు బిజినెస్‌లో సపోర్ట్‌ నిలుస్తున్నందుకు బెక్కెం వేణుగోపాల్‌గారికి, రామచంద్రగారికి థాంక్స్. సుధీర్‌గారి అభిమానుల కారణంగా మూవీ నుంచి రెండో పాటను కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశాం. తప్పకుండా పాట, సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం.

నిర్మాత విజేష్ తయల్ మాట్లాడుతూ ‘‘కనుల నీరు రాలదే..’ పాటకు మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. దర్శకుడు అరుణ్ చాలా కాలంగా తెలుసు. తను సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. బెక్కెం వేణుగోపాల్‌గారు ఇప్పుడు మా టీమ్‌లో ఓ మెంబర్ అయ్యారు. సుధీర్‌గారితో మంచి జర్నీ. తనే ముందుండి ఫోర్స్‌లా అందరినీ నడిపించారు. సినిమాను ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ అరుణ్ విక్కీరాల మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర తర్వాత సుధీర్ రేంజ్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. తనొక సూపర్ స్టార్ అవుతారు. మేం ఎంత బాగా సినిమాను తీసినా మంచి మ్యూజిక్ లేకపోతే అద్భుతం జరగదు. ఈ సినిమా విషయానికి వస్తే మోహిత్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. అలాగే మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సూపర్బ్‌గా అందించారు. మా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్. సుధీర్ అభిమానుల కోసం ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. అందుకనే వారి సమక్షంలోనే పాటను రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

రామచంద్రరావు మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర చిత్రంలోని మొదటి పాటను ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేశారో మనకు తెలుసు. అందుకనే ఇప్పుడు రెండో సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నాం. సుధీర్‌గారు, అరుణ్‌గారికి థాాంక్స్. సుధీర్‌ని పెద్ద స్టార్‌గా కాలింగ్ సహస్త్ర మూవీ నిలబెడుతుంది’’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర సినిమాను చూడగానే బాగా నచ్చింది. వెంటనే టీమ్‌తో ట్రావెల్ మొదలు పెట్టాం. టీజర్, ఫస్ట్ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సర్‌ప్రైజింగ్ ట్రైలర్‌ను విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం. సినిమాను భారీగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. సుధీర్‌ని కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి. ప్రేక్షకులు సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మోహిత్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్ సాంగ్‌ని చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత విజేష్‌గారితో జర్నీ మరచిపోలేను. సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయనకు ఇతర ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. బెక్కెంగారు సినిమా చూడగానే ఆయనకు నచ్చటంతో మా టీమ్‌ని నడిపించటం మొదలు పెట్టారు. మంచి కంటెంట్ సినిమాలను సపోర్ట్ చేయాలనుకునే నిర్మాత ఆయన. డాలీషా మంచి నటి. నార్త్ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని నటించారు. తనింకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఈ స్టేజ్‌కి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోస్ చేసినా, సినిమాలు చేసినా వారు సపోర్ట్ చేశారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేస్తాం. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం’’ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #calling sahasra
  • #ravi teja nimmala
  • #Tollywood

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

2 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

12 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

2 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

3 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

8 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version