Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

సుధీర్ ఆనంద్ అలియాస్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా బిజీగా రాణిస్తున్నాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ వంటి సినిమాలతో హీరోగా కూడా పాస్ మార్కులు వేయించుకున్న అతను తర్వాత ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. తర్వాత ‘గోట్’ అనే సినిమా చేశాడు. అది ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీని పరిస్థితి.

Sudigali Sudheer

అయినప్పటికీ మరో కొత్త సినిమాకి ఓకే చెప్పాడు. అది ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ‘హైలెస్సో’ అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలారు.ప్రసన్న కుమార్ కోట ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాంచరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, అలాగే సందీప్ కిషన్ పర్సనల్ పీఆర్ గా కెరీర్ ను ప్రారంభించిన శివ చెర్రీ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.

రవికిరణ్‌ మరో నిర్మాత. ‘వజ్ర వరాహి సినిమాస్’ అనే ను స్థాపించి వారి ఈ సినిమాని రూపొందించనున్నారు.వి.వి.వినాయక్, మెహర్ రమేష్, బన్నీ వాస్ వంటి స్టార్స్ ఓపెనింగ్ కి అతిధులుగా విచ్చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ థ్రిల్లర్ మూవీ ఇది అని తెలుస్తుంది. ‘కాంతార’ స్టైల్లో దైవత్వంతో నిండి ఉంటుందని.. రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టంచేసింది.

శివాజీ ఈ సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నారు. నటాషా సింగ్, నక్ష సరణ హీరోయిన్లుగా నటిస్తుండగా అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘హైలెస్సో’ థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus