Sudigali Sudheer: భారీగా రెమ్యునరేషన్ ను పెంచేసిన సుధీర్.. ఎంతంటే?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. సుధీర్ గత సినిమాలలా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. కథల ఎంపికలో సుడిగాలి సుధీర్ పొరపాట్లు చేస్తుండటం వల్లే అతను నటించిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. గాలోడు సినిమాకు రెండున్నర కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమాకు సుధీర్ పారితోషికం 50 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సుడిగాలి సుధీర్ కెరీర్ ను కొనసాగిస్తూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. తను సంపాదించిన డబ్బులో కొంతమొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం సుధీర్ ఖర్చు చేస్తున్నారు. చూపు లేని ఒక సింగర్ కు తన వంతు సహాయం చేస్తానని సుధీర్ మాట ఇచ్చారని సమాచారం. సుధీర్, రష్మీ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండగా త్వరలో ఈ జోడీ సినిమాలో కూడా కలిసి కనిపించనుందని తెలుస్తోంది.

సుధీర్ రష్మీ కాంబో మూవీ అంటే రికార్డ్ స్థాయిలో బిజినెస్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గజ్జల గుర్రం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సుధీర్, రష్మీ కాంబో త్వరలో బుల్లితెరపై కూడా కలిసి కనిపించనుంది. జబర్దస్త్ షోలో అతి త్వరలోనే ఎంట్రీ ఉండనుందని సుధీర్ కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం సుధీర్ ఒక కామెడీ షో చేస్తుండగా ఈ షోపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో త్వరలో ఈ టాక్ షో ప్రసారం కానుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus