థియేటర్లలో ఫ్యాన్స్ డ్యాన్స్ చేసే సాలిడ్ సాంగ్ ‘సుగుణా సుందరీ’

నటసింహ నందమూరి బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల ‘జై బాలయ్య’ అనే మాస్ ఆంథెమ్ రిలీజ్ చేయగా.. ఇంకా ట్రెండిగ్ అవుతూనే ఉంది.. గతకొద్ది రోజులుగా ఎక్కడవిన్నా ఇదేే పాట.. రీసెంట్‌గా ‘సుగుణా సుందరీ’.. సుగుణా సుందరీ.. సుర సుర సూపులా రాకుమారీ’ అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్‌ వదిలారు..

‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి అలరించే లిరిక్స్ రాయగా.. రామ్ మిర్యాల, సిగ్న్ద శర్మ చాలా చక్కగా పాడారు.. శేఖర్ మాస్టర్ సింపుల్, కూల్ స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు.. ఈమధ్య బాలయ్య బెస్ట్ లుక్ ఇదే అనేంత స్టైలిష్‌గా కనిపించాడు.. శృతితో బాల పెయిర్ బాగుంది.. ఇక ఇద్దరూ కలిసి సాలిడ్ స్టెప్పులేశారు.. బాలయ్య 62 వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేయడం ఆశ్చర్యమే.. మంచి ఊపుతో సాగిన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది..

థియేటర్లలో ఫ్యాన్స్ డ్యాన్స్ చేసే సాంగ్ ఇచ్చాడు థమన్ అంటూ నెట్టింట ఈ పాటను తెగ వైరల్ చేసేస్తున్నారు నందమూరి అభిమానులు.. ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది.. బాలయ్య ద్విపాత్రాభినయం సినిమా మీద అంచనాలు పెంచేసింది.. జనవరి 12న నటసింహ ‘వీర సింహా రెడ్డి’ గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు..

‘‘రికార్డుల ఊచకోత మొదలవనుంది.. ఇక ట్రైలర్ కోసం వెయిటింగ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. ‘వీర సింహా రెడ్డి’ వచ్చేస్తున్నాడు’’.. అంటూ ఇప్పటినుండే ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.. ఎప్పటిలానే 2023 సంక్రాంతి సీజన్ బాలయ్యకి కలిసొస్తుందని.. ‘అఖండ’ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ మాస్ జాతర చూడబోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus