బిగ్‌బాస్‌ 4: వెళ్లిపోతూ సుజాత ఏమంది.. ఏం చేసింది!

అందరూ అనుకున్నట్లే ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటి నుంచి నవ్వుల సుజాత వెళ్లిపోయింది. తక్కువ ఓట్లు వచ్చాయంటూ నాగార్జున ఆమెను బయటకు తీసుకొచ్చేశాడు. ఎలిమినేషన్‌లో జోన్‌లో ఆఖరికి అమ్మ రాజశేఖర్‌, సుజాత మిగిలారు. ఆఖరికి నవ్వులు పూయించే వ్యక్తిని కాకుండా, నవ్వే ఆమెనే బయటకు పంపించారు. వెళ్లిపోతూ సుజాత ఇంటి సభ్యుల గురించి ఏమందో చూద్దాం.

వాళ్లు సంతోషంగా ఉన్నారు…
‘‘నేను ఇంత ఎంజాయ్‌ చేస్తానని, ఇన్ని మెమొరీస్‌ సంపాదిస్తానని నాకు తెలియదు. హైదరాబాద్‌లో నౌకరు చేసుకొని బతుకుదాం అని వచ్చాను. ఊళ్లో నా తల్లిదండ్రులు నా బిడ్డ అక్కడ ఉంది అనుకుంటారు అనుకునేదాన్ని. కానీ ఈ ఇంటికి రావడం, ఇలా పేరు తెచ్చుకోవడంతో వాళ్లు చాలా సంతోషంగా ఉండుంటారు’’ అని ఎలిమినేట్‌ అయ్యాక స్టేజీ మీద చెప్పింది.

బిగ్‌బాస్‌ ఇంటి వాళ్ల గురించి చెప్పడానికి నాగార్జున మూడు హార్ట్‌ సింబల్స్‌ ఇచ్చాడు. రెడ్‌, బ్లాక్‌, బ్రోకెన్‌ హార్ట్‌ సింబల్స్‌ ఇచ్చాడు. వాటిని ఇంటి సభ్యులకు అతికించి వాళ్ల గురించి చెప్పమన్నాడు. నోయల్‌ గురించి చెబుతూ ఈ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ సుజాత కార్యక్రమం మొదలైంది. నేను ఎలా మాట్లాడినా తీసుకున్నాడు. నా గురించి చాలా ఆలోచిస్తాడు. నాలా మారి నన్ను చూసుకున్నాడు అని చెప్పింది. లాస్యకు మరో హార్ట్‌ ఇస్తూ గాసిప్‌ గాళ్స్‌ అని గుర్తు చేసుకుంది. ప్రసాదం పంచినట్లు ప్రేమను పంచుతాడు అంటూ అవినాష్‌కు హార్ట్‌ ఇచ్చింది. .

ఇక బ్రోకెన్‌ హార్ట్‌ విషయానికొస్తే… అభిజీత్‌కు తొలి బ్రోకెన్‌ హార్ట్‌ ఇచ్చింది. తనను చెల్లి అని పిలవడంతో అభిజీత్‌ మాట తీరు నచ్చక, తర్వాత అభిజీత్‌ అన్న మాటలు నచ్చలేదు అని చెప్పింది. టాస్క్‌ జరిగే సమయంలో తనను కసురుకున్నాడంటూ మాస్టర్‌కు మరో బ్రోకెన్‌ హార్ట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత పక్కన కూర్చునే ప్లేస్‌ ఉన్నా కూర్చోలేదు అని కూడా చెప్పింది. ఆరియానాను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఏదైనా మాట్లాడితే మిస్ అండర్‌ స్టాండింగ్‌ వస్తోంది అని చెప్పింది. స్విచ్‌ కాయిన్‌ విషయంలో తనను నామినేట్‌ చేయడం నచ్చలేదని చెప్పింది. అలాగే తనను నామినేట్‌ చేసినప్పుడు మాట్లాడిన విషయాలు నచ్చలేదని కుమార్‌ గురించి చెప్పింది.

ఇక బ్లాక్స్‌ హార్ట్స్‌ విషయానికొస్తే… తొలిగా హారిక గురించి చెప్పింది. ఇంట్లో నోయల్‌, అభిజీత్‌తోనే కంఫర్ట్‌గా ఉంటోందని చెప్పింది. మిగిలినవాళ్లతోనూ అలా కలసిపోవాలని సూచించింది. ఫిజికల్‌ టాస్క్‌ వస్తే టర్ర్‌ మంటుంది అంటూ దివి గురించి వివరించింది. సోహైల్‌ కోపాన్ని తట్టుకోలేం అంటూ మరో బ్లాక్‌ హార్ట్‌ ఇచ్చింది. ఇక మోనాల్‌ గురించి మాట్లాడుతూ తనను సొంత చెల్లి అనుకుంది అని చెప్పింది. అయితే ఈ వారం ఇంటిలో జరిగిన విషయాలతో ఇబ్బందిగా మారింది అని చెప్పింది. ఓపెన్‌గా ఉండాలి అని సూచించింది. మంచిగా ఇల్లు చూసుకో, చక్కగా ఆడు అని అఖిల్‌కు చెప్పింది.

ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ నాగార్జున ఇచ్చిన బిగ్‌బాంబ్‌ను సోహైల్‌ మీద వేసింది. దీంతో ఈ వారం మొత్తం ఇంట్లో పడిన బాసన్లను సోహైల్‌ తోమాలంటూ బిగ్‌బాంబ్ విసిరింది. మామూలుగానే పని అంటే బద్ధకం ఉన్న సోహైల్‌ ఈ వారం ఎలా ఆ పనులు చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus