లీకైనా హ్యాపీగా ఉన్న సుకుమార్ అండ్ టీమ్..!

అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరూ కలిసి ప్రస్టేజియస్ గా చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లో నుంచీ ఒక ఆరు నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సుకుమార్ అండ్ టీమ్ ఫుల్ ఫైర్ అవుతుందనే అనుకున్నారు. కానీ, సుకుమార్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందట. ఎందుకంటే, సినిమా అవుట్ పుట్ ఇప్పటి వరకూ అద్దిరిపోయిందని, అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ తీసిన సినిమా చాలా చక్కగా వచ్చిందని అంటున్నారు. షూటింగ్ రష్ ని చూసిన దర్శకుడు సుక్కు చాలా హ్యాపీగా ఉన్నాడట. లేటుగా సినిమాని మొదలుపెట్టినా మధ్యలో అవాంతరాలు వచ్చినా షూటింగ్ అనుకున్న విధంగానే సాగుతోందని, ఏదైతే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఉందో అది సూపర్బ్ గా వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసంట్ గా ఈ సినిమా ఫోటోగ్రాఫర్ చనిపోవడం, అలాగే వీడియో సాంగ్ ఒకటి లీక్ అవ్వడం ఇవన్నీ కూడా సినిమా అవుట్ పుట్ పై ఎలాంటి ప్రభావం పడట్లేదని అంటున్నారు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా రంపచోడవరం లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంట్రడక్షన్ సాంగ్ మీద చిత్రీకరణ సాగుతోంది. దీనికి సంబంధించిన వీడియోనే లీక్ అయ్యింది. ఇప్పుడు ఇది చిత్రయూనిట్ లైట్ గా తీస్కుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన అమ్మాయిగా కనిపించబోతోందని టాక్. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ మార్కెట్ ని పెంచుతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus