పుష్ప విషయంలో సుకుమార్ కి ఎన్ని కష్టాలో..!

  • June 17, 2020 / 08:30 PM IST

టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ గా సుకుమార్ కి మంచి పేరుంది. ఐతే ఈ స్టార్ డైరెక్టర్ కి చెప్పలేనంత టాలెంట్ ఉన్నా..ఆ స్థాయి విజయాలు దక్కింది తక్కువే. ఈ దర్శకుడుకి మరో బాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ప్రతి సినిమాకు మధ్య కనీసం రెండేళ్ల గ్యాప్ పడాల్సిందే. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్ రెండేళ్లకు గానీ సినిమా ఒకే చేయలేకపోయాడు. అనుకున్న హీరోలు హ్యాండ్ ఇవ్వడం, మిగతా స్టార్ హీరోలు ఖాళీగా లేకపోవడం వలన ఈయనకు ఇంత గ్యాప్ వచ్చింది.

ఇక అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ గట్టి షాక్ ఇచ్చింది. బన్నీతో ఆయన చేస్తున్న పుష్ప మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఎప్పుడో మార్చిలో పుష్ప సెకండ్ షెడ్యూల్ కేరళలో మొదలుకావాల్సివుండగా, లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇటీవల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతి ఇవ్వగా తిరిగి ప్రారంభించే ప్రణాళికలో డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు. అవుట్ డోర్ షూటింగ్ మినహాయించి,

సెట్స్ లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిపే ఆలోచనలో ఉన్నారు. ఐతే ఈ మూవీ హీరోయిన్ రష్మిక మందాన షూటింగ్ కి ససేమిరా అంటుంది. మరో మూడు నెలల వరకు షూటింగ్ కి వచ్చేది లేదని ఆమె చెప్పేశారని తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకోగా సుకుమార్ కరోనా బాధితుల జాబితాలో చేరినట్లైంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus