Sukumar: బన్నీ లుక్ ను కావాలనే దాచేశారా..?

ఆర్య, ఆర్య 2, నాన్నకు ప్రేమతో, 1 నేనొక్కడినే సినిమాలతో ప్రయోగాలు చేసిన సుకుమార్ రూట్ మార్చారు. రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప సినిమాలో బన్నీని ఊరమాస్ గా చూపిస్తున్నారు. నిన్న విడుదలైన టీజర్ సుకుమార్ శైలికి భిన్నంగా కొత్తగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుల తెలివేతేటలను పరీక్షించే సినిమాలను తెరకెక్కించిన సుకుమార్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ ఏ స్థాయిలో శ్రమించాడో టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. అయితే టీజర్ లో బన్నీ ఒక లుక్ లోనే కనిపించారని మరో లుక్ ను దాచేశారని సమాచారం. డీజే సినిమాలో చూసిన విధంగానే ఈ సినిమాలో బన్నీ రెండు షేడ్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

టీజర్ తో పుష్ప సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ మరో పాత్రలో స్టైలిష్ గా కనిపించనున్నారని సమాచారం. టీజర్ లో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. బన్నీ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అనే సంగతి తెలిసిందే. ఆగష్టు 13వ తేదీన పుష్ప సినిమా టీజర్ రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం భారీ మొత్తం ఖర్చు చేసినట్టు సమాచారం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus