సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ సినిమా వస్తుందంటే ఆ హడావిడి వేరేలా ఉంటుంది. తల్లిదండ్రులు దగ్గరుండి ప్రమోషన్స్ చేస్తారు, ఈవెంట్లకు వచ్చి హైప్ క్రియేట్ చేస్తారు. కానీ యాంకర్ సుమ స్టైల్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. తన కొడుకు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ సినిమా విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక తల్లిగా సపోర్ట్ ఉన్నా, కెరీర్ పరంగా మాత్రం కొడుకును సొంత కాళ్లపై నిలబడమని చెప్పిన విధానం గ్రేట్ అనిపించుకుంటోంది.
అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా జరిగిన మోగ్లీ థాంక్స్ మీట్ లో రోషన్ ఒక ఎమోషనల్ విషయాన్ని బయటపెట్టారు. సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రమ్మని అమ్మను అడిగారట. కానీ సుమ మాత్రం సున్నితంగా తిరస్కరించారట. “నేను వస్తే నా ఇమేజ్ వల్ల సినిమా ఆడుతుంది అనుకోకూడదు, నీ హార్డ్ వర్క్ ను నమ్మి ముందుకు వెళ్లు, ఆడియన్స్ ఆదరిస్తారు” అని చెప్పి పంపించారట.
ఇది నిజంగా చాలా గట్టి నిర్ణయం. తన క్రేజ్ వాడితే సినిమాకు మరికొంత బజ్ దొరుకుతుంది. కానీ సుమ అలా ఆలోచించలేదు. తన కొడుకు కష్టం మీద పైకి రావాలని, స్వయంకృషితో సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. అందుకే ఈవెంట్లకు దూరంగా ఉండి, రోషన్ కు నిజమైన పరీక్ష పెట్టారు.
వేదికపై రోషన్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలు ఈవెంట్ కు రాలేకపోయారని, ఒకవేళ వచ్చి ఉంటే అక్కడే వాళ్ళ కాళ్ళు మొక్కేవాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లు వెనక ఉండి నడిపించకపోయినా, వాళ్లు నేర్పిన డిసిప్లిన్, హార్డ్ వర్క్ తనను ఇక్కడిదాకా తెచ్చాయని ఎమోషనల్ అయ్యారు. సుమ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈరోజు వచ్చిన సక్సెస్ పూర్తిగా రోషన్ ఖాతాలోకే వెళ్ళింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకుడు. ఒక అనాథ కుర్రాడు ఎస్సై అవ్వాలనే లక్ష్యంతో పడే కష్టాలను ఇందులో చాలా నేచురల్ గా చూపించారు. మొత్తానికి నెపోటిజం అని విమర్శించే వారికి సుమ తన చర్యతోనే సమాధానం చెప్పినట్లయింది. కొడుకును రికమండేషన్లతో కాకుండా, రియాలిటీలో గెలిపించిన సుమ పెంపకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.