Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక – హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ

ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక – హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ

  • June 18, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక – హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో ఇంటర్వ్యూ…

ప్రశ్న: సుమంత్ అశ్విన్ గారూ… మీరు హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ విడుదలై జూలై 20కి పదేళ్లు. అలాగే, 30న మీ పుట్టినరోజు. మీ ప్రయాణం, కొత్త నిర్ణయాల గురించి…
సుమంత్ అశ్విన్: నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. ఈ పదేళ్లు టైమ్ తెలియకుండా చాలా స్పీడుగా వెళ్ళింది. హ్యాపీగా ఉన్నాను. కొత్త నిర్ణయాలు అంటే… ఆల్రెడీ చేసిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త రోల్స్, రిలేటబుల్ రోల్స్ చేయాలని ఉంది.

ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’లో మీ రోల్ ఎలా ఉంటుంది?
సుమంత్ అశ్విన్: ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే… ఇందులో డిఫరెంట్ రోల్ చేశా. ఇంతకు ముందు చేసినవి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ… కొన్ని అంశాలు లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్ ఉంటుంది. ‘7 డేస్ 6 నైట్స్’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్ చేశా. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు… ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్‌డేట్‌ అయ్యారు. వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’లో మీరు ఏం చేస్తుంటారు?
సుమంత్ అశ్విన్: ఒక నార్మల్ యంగ్‌స్ట‌ర్‌. ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో… నా లుక్ కూడా అలాగే ఉంటుంది.

ప్రశ్న: రోహన్, హీరోయిన్స్ రోల్స్ గురించి…
సుమంత్ అశ్విన్: రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే… ఆమెను ‘సతి’ సినిమాలో కూడా తీసుకున్నాం.

ప్రశ్న: సినిమా ఎలా ఉండబోతుంది?
సుమంత్ అశ్విన్: ఇదొక సింపుల్ ఫిల్మ్. ప్రేక్షకులు హ్యాపీగా ఎంట‌ర్‌టైన్‌ అయ్యే సినిమా. నిన్నే సినిమా చూశా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.

ప్రశ్న: మీ ఫాదర్ ఎంఎస్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. హీరోలను ఎలివేట్ చేయడం కోసం సినిమాలు తీశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎలివేట్ చేయడం కోసం సినిమాలు తీస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ గురించి…
సుమంత్ అశ్విన్: నేను ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి. ప్లాన్ చేస్తున్నాను. అయితే, ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ‘7 డేస్ 6 నైట్స్’ కాపీ చూపించారు. సినిమా చాలా బావుంది. నేను చాలా హ్యాపీ. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే… మరో జన్మంటూ ఉంటే, దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే ‘మళ్ళీ హైదరాబాద్ లో ఎంఎస్ రాజు గారి అబ్బాయిలా పుట్టాలి’ అని కోరుకుంటా. ఆయన ఎటువంటి ఫాదర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే నాన్న అది ఇచ్చారు. నాన్న పర్ఫెక్ట్ ఫాదర్. ఎన్ని జన్మలెత్తినా… ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలని కోరుకుంటున్నా.

ప్రశ్న: మీ నాన్నగారు మీకు బ్లాక్ బస్టర్ ఇవ్వలేదని…
సుమంత్ అశ్విన్: ఒక్కోసారి టైమ్  అంతే! ‘తూనీగ తూనీగ’ కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు.

ప్రశ్న: మీ నాన్నగారు దర్శకుడని ‘7 డేస్ 6 నైట్స్’ చేశారా? కథ నచ్చి చేశారా?
సుమంత్ అశ్విన్: రెండూ! ఇప్పుడు నాన్నగారు ఒక ఫైర్ లో ఉన్నారు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. ‘డర్టీ హరి’తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు.  నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మధ్యలో ఎక్కడో ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్… ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్’ అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి… నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. ‘7 డేస్ 6 నైట్స్’లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది.

ప్రశ్న: మీరు ఎప్పుడైనా దర్శకుడు కావాలని అనుకున్నారా?
సుమంత్ అశ్విన్: చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల  అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి… నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. ‘వర్షం’ సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే… నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి ‘చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు’ అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా.

ప్రశ్న: చివరగా, ‘7 డేస్ 6 నైట్స్’ ఫ్యామిలీతో చూసేలా ఉంటుందా?
సుమంత్ అశ్విన్: నేను కాపీ చూసినప్పుడు నాతో పాటు మా అమ్మ, సిస్టర్ కూడా ఉన్నారు. మా ఇంట్లో సినిమా అని కాదు… చీప్‌గా ఉంటే వాళ్ళతో కలిసి చూడలేం. ఇబ్బంది పడే సన్నివేశాలు ఉండవు. నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.

ప్రశ్న: మీరు నిర్మాతగా మారారు. వైల్డ్ హానీ ప్రొడక్షన్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. ఆ పేరు వెనుక కారణం ఏంటి?
సుమంత్ అశ్విన్: ‘డర్టీ హరి’తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు… నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది  దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. ‘డర్టీ హరి’, ఈ కథలు చూస్తే నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని ‘వైల్డ్ హనీ ప్రొడక్షన్స్’ అని పేరు పెట్టా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7days 6nights
  • #Sumanth Aswin

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

8 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

8 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

9 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

14 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

9 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

10 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

11 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

12 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version