యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు సందీప్. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ,’ఫ్యామిలీ మెన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) , రామ్ అబ్బరాజు(సామజవరగమన ఫేమ్) వంటి వాళ్ళను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఇతనే..! సందీప్ కిషన్ సినిమాలకి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే వస్తాయి.
కానీ ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ లేకపోవడం వల్ల.. ఓ అండర్ రేటెడ్ హీరోగానే కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అయితే ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమా బాక్సాఫీస్ వద్ద కొంచెం బాగానే ఆడింది. ఇటీవల వచ్చిన ‘రాయన్’ (Raayan) లో కూడా సందీప్ పాత్ర అందరినీ మెప్పించింది. అయితే పారితోషికం విషయంలో సందీప్ కిషన్ ఎక్కువగా వార్తల్లోకెక్కింది లేదు.
కానీ ఈ మధ్య దాని విషయంలో కొంచెం స్ట్రిక్ట్ అయినట్లు తెలుస్తుంది. ‘రాయన్’ ప్రమోషన్స్ లో కూడా సందీప్ కిషన్ ఈ విషయం పై స్పందించాడు. ‘తన మార్కెట్ ను బట్టి కొంచెం డిమాండ్ చేయడం అలవాటు చేసుకుంటున్నానని, అలా అని నిర్మాతని ఇబ్బంది పెట్టేయకుండా.. మీకు కుదిరినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని చెబుతున్నట్టు’ సందీప్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రినాథ రావ్ (Trinadha Rao) నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’ అనే సినిమా చేస్తున్నాడు సందీప్. దీని కోసం అతను రూ.6 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఇక సినిమా బడ్జెట్ కూడా రూ.30 కోట్లు అవుతుందని వినికిడి. రాజేష్ దండా (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.