సందీప్ కిషన్ అప్పులు పాలు అయ్యాడా..?

  • February 16, 2021 / 05:36 PM IST

హీరో సందీప్ కిషన్ అప్పులు పాలు అయిపోయాడు.. పీకల్లోతూ కష్టాల్లో ఉన్నాడా అంటే నిజమే అంటున్నారు కోలీవుడ్ తమ్ముళ్లు. రీసంట్ గా ఎన్నో బిజినెస్ లు స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ లాక్డౌన్ తర్వాత ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతిన్నాడట. అంతేకాదు, ప్రస్తుతం తను చేస్తున్న ఎ1 ఎక్స్ ప్రెస్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడని అంటున్నారు. సినిమా ఇప్పుడు రిలీజ్ కి ఉన్న నేపథ్యంలో చాలా టెన్షన్ పడుతున్నాడట.

తను స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో కొంతభాగం వాటా అయినా వస్తే చేసిన అప్పులు తీర్చేయాలని చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నట్పే తునాయ్ అనే తమిళ రీమేక్ కి ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాకీ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాలో సందీప్ కిషన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాదు, లావణ్య త్రిపాటి అందాలు, స్పోర్డ్స్ అకాడమీలో జరిగే రాజకీయాలతో సినిమా మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది.

ఫిబ్రవరి 19వ తేదిన ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్ కొట్టి ఒడ్డున పడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus