Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

  • February 4, 2023 / 08:45 PM IST

సందీప్ కిషన్.. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న సినిమాలను చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా తన నటనతో ఎంగేజ్ చేసే సామర్థ్యం కలిగిన హీరో సందీప్ కిషన్ . కెరీర్ ప్రారంభంలో నాని వంటి హీరోలతో సమానంగా రాణించిన ఇతను తర్వాత విజయ్ దేవరకొండ వంటి హీరోలు రావడంతో రేసులో వెనుకపడ్డాడు. త్వరలో ‘మైఖేల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందీప్ కిషన్.. ఈ చిత్రంతో పెద్ద హిట్టు కొట్టి ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం తన వంతు కృషి చేసినట్టు సందీప్ తెలిపాడు. టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. కాబట్టి ఈ సినిమాతో సందీప్ హిట్టు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. సరే ‘మైఖేల్’ సినిమా విడుదల సందర్భంగా సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో.. వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నగరం :

సందీప్ కిషన్ ఓ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ.2.8 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.2.3 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

2) శమంతకమణి :

సందీప్ కిషన్ ఓ హీరోగా నటించిన ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.2 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

3) నక్షత్రం :

సందీప్ కిషన్ ఓ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి బాక్సాఫీస్ వద్ద రూ.4.27 కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

4) కేరాఫ్ సూర్య :

సందీప్ కిషన్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.1.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

5) మనసుకు నచ్చింది :

సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.1.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

6) నెక్స్ట్ ఏంటి :

సందీప్ కిషన్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.0.87 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

7) నిను వీడని నీడను నేనే :

సందీప్ కిషన్ హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.3.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టి.. హిట్ గా నిలిచింది.

8) తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ :

సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.2.78 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

9) ఎ1 ఎక్స్ ప్రెస్ :

సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కొనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.4.47 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ గా నిలిచింది.

10) గల్లీ రౌడీ :

సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.2.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.2.07 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus