సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గురించి తెలియనివారుండరు. “కార్తికేయ, నిన్నుకోరి, ప్రేమమ్” లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడమే కాక దర్శకుడిగా నిఖిల్ తో “సూర్య వర్సెస్ సూర్య”ను తెరకెక్కించి మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకొన్న కార్తీక్ త్వరలోనే మరోమారు డైరెక్టర్ గా తన సత్తాను ప్రూవ్ చేసుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల కార్తీక్ చెప్పిన స్టోరీకి సందీప్ కిషన్ కనెక్ట్ అవ్వడం, వెంటనే సందీప్ తనకు తెలిసిన నిర్మాతలకు అదే స్టోరీ చెప్పించడం జరిగిపోయాయ్. తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం 2018లో సెట్స్ కు వెళ్లనుంది.
ఇకపోతే.. సందీప్ కిషన్ కథానాయకుడిగా తమిళంలో నటించిన “మాయావన్” తెలుగులో రిలీజ్ కి నోచుకోకపోగా.. మరో చిత్రం “కేరాఫ్ సూర్య” నవంబర్ 10న విడుదలవుతుంది. వరుసబెట్టి సందీప్ ఇన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. మనోడికి స్టార్ డమ్ కానీ సరైన సక్సెస్ కానీ లభించలేదు. మరి “కేరాఫ్ సూర్య” సూపర్ హిట్ అయ్యి సందీప్ కిషన్ కెరీర్ కు ఏమేరకు ప్లస్ అవుతుందో చూద్దాం.