సందీప్ కిషన్ తో మెహరీన్

నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. ఆ సినిమా విజయం సాధించడటంతో పాటు మెహరీన్ నటనకూ పేరొచ్చింది. అయితే అవకాశాలు మాత్రం కరువయ్యాయి. హీరోయిన్ల విషయంలో తొలి సినిమా హిట్ కొడితే దర్శక నిర్మాతలు క్యూ కడతారు. అయితే మెహరీన్ పరిస్థితి దానికి విరుద్ధంగా తయారైంది. అయితే తెలియవస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడామె మరో సినిమాకి సైన్ చేయనుందట.ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల ఫలితాన్ని పక్కన పెట్టి దూకుడు పెంచిన సందీప్ కిషన్ తెలుగుతోపాటు తమిళంలోను వరుస సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న ‘నక్షత్రం’ పూర్తి కాగానే సుశీంద్రన్ దర్శకుడిగా సందీప్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ దర్శకుడు ‘నాపేరు శివ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే. ఈ సినిమాలో సందీప్ సరనస ఆడిపాడేందుకు మెహరీన్ ని సంప్రదించారా దర్శక నిర్మాతలు. ఇందుకు మెహరీన్ సుముఖంగా ఉందట. నిజానికి బన్నీ ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో మెహరీన్ నటించాల్సి ఉంది. చివరి నిమిషంలో పూజ హెగ్డే ఎంట్రీ ఇవ్వడంతో మెహరీన్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మిస్తోన్న ‘ఫిల్లరి’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల భామ.

https://www.youtube.com/watch?v=F-Qmro2QBCE

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus