Michael: సందీప్ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎంతంటే..?

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు హిట్స్ వచ్చినా.. ఆ తరువాత అతడు చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ అతడికి అవకాశాలకు మాత్రం లోటు లేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా అడపాదడపా సినిమాలు మాత్రమే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటున్నాయి తప్ప బ్లాక్ బస్టర్ అయితే రావడం లేదు.

అందుకే ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సందీప్ కూడా పాన్ ఇండియా వైపే అడుగులు వేస్తున్నారు. ఆయన నటించిన ‘మైఖేల్’ సినిమాను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో పేరున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ పెరిగింది. బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం మంచి ఆఫర్ వచ్చింది. రూ.1.05 కోట్లకు సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్మేశారు. సందీప్ కిషన్ సినిమా ఇంత మొత్తానికి అమ్ముడైందంటే విశేషమనే చెప్పాలి. ఇప్పటికే మలయాళం, హిందీ, తమిళ్ రైట్స్ ను క్లోజ్ చేశారు.

ఇప్పుడు కొత్తగా ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా దివ్యాంశ కౌశిక్ నటించింది. అలానే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. గౌతమ్ మీనన్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. భరత్ చౌదరి, ఏషియన్ సునీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus