Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

బాలీవుడ్ హీరోలను, సీనియర్ నటులను సౌత్ సినిమాల్లో కేవలం విలన్ పాత్రలకే పరిమితం చేసి క్యాష్ చేసుకోవాలని సౌత్ ఫిలిం మేకర్స్ ఆరాటపడుతున్నారు అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి. ఇటీవల అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

Suniel Shetty

సునీల్ శెట్టి(Suniel Shetty) మాట్లాడుతూ… “నాకు సౌత్ నుండి ఆఫర్లు వస్తున్నాయి. కానీ అక్కడి ఫిలిం మేకర్స్ అంతా ఒక్కటే ఫార్ములా ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోలను తీసుకుని వాళ్ళని పవర్ఫుల్ విలన్లుగా చూపిస్తే, వాళ్ళ హీరోలని ఇంకా బాగా ఎలివేట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇది అక్కడి జనాలను,బాలీవుడ్ జనాలను దగ్గరయ్యేలా చేస్తుంది.. అదే మంచి ఫార్ములా అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఆ ఆలోచన నాకు నచ్చడం లేదు.

బాలీవుడ్ నటులను కేవలం విలన్ పాత్రలకి పరిమితం చేయడం సరైన పద్ధతి కాదు.సూపర్ స్టార్ రజనీకాంత్‌ గారితో కలిసి నేను ‘దర్బార్’ నటించాను. అందులో కూడా నేను చేసింది విలన్ పాత్రే. రజనీ సార్‌తో పనిచేయాలనే నా చిరకాల కోరిక వల్ల అది చేశాను. కానీ తర్వాత కూడా నాకు ఎక్కువగా నెగిటివ్ రోల్సే ఆఫర్ చేస్తున్నారు” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు సునీల్ శెట్టి.

అంతేకాదు కంటెంట్లో బలం ఉంటే భాషా బేధాలు లేకుండానే సినిమాలకి మంచి రీచ్ వస్తాయి అని కూడా హితవు పలికాడు సునీల్ శెట్టి.’దర్బార్’ తర్వాత ఆయన మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, వరుణ్ తేజ్ ‘గని’ సినిమాల్లో కూడా నటించారు. అవి ప్లాప్ అయ్యాయి.

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus