మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు సునీల్ ప్లాన్

కమెడియన్ గా పీక్ స్టేజ్ లో ఉండగా ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగానూ సూపర్ హిట్ అందుకొన్న సునీల్ ఆ తర్వాత కూడా కామెడీ రోల్ చేస్తూనే హీరోగా మధ్యలో సినిమాలు చేశాడు. అయితే.. ‘పూలరంగడు’ సూపర్ హిట్ అయ్యేసరికి ఇకపై హీరోగానే కొనసాగాలనుకొన్నాడు. అయితే.. అనుకొన్నట్లుగా ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. హీరోగా నటించిన సినిమాలన్నీ అయితే ఫ్లాపులు లేదంటే డిజాస్టర్లుగా నిలిచాయే తప్ప కనీస స్థాయిలో ఆడిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇక రీసెంట్ గా రిలీజైన “2 కంట్రీస్” అయితే బడ్జెట్ లో 20% కూడా వెనక్కి తీసుకురాలేకపోవడం గమనార్హం.

ఈ విషయాలన్నిట్నీ జాగ్రత్తగా గమనించాడో లేక ఇలాగే ఫ్లాప్ సినిమాలు చేసుకుంటూ ముందుకెళితే తన ఉనికిని సైతం కోల్పోయే అవకాశాలున్నాయని తెలుసుకొన్నాడో తెలియదు కానీ.. తనకు కెరీర్ ని ప్రసాదించిన కామెడీ రోల్స్ వైపు మళ్ళీ సుముఖత చూపడం మొదలెట్టాడు. ఇప్పుడు వరుసబెట్టి కామెడీ రోల్స్ సెలక్ట్ చేసుకొంటున్నాడు. ఆల్రెడీ చిరంజీవి, వెంకటేష్, రవితేజల చిత్రాల్లో కామెడీ రోల్స్ కి సైన్ చేసిన సునీల్.. కొత్త దర్శకులను, నిర్మాతలను, సీనియర్ హీరోలను “నేను కామెడీ రోల్స్ చేయడానికి రెడీ” అని సందేశం పంపిస్తున్నాడు. మరి కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో సునీల్ ఏమేరకు విజయం సాధిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus