వివిధ రంగాల్లో ప్రముఖులకు మైనపు విగ్రహాలను “మేడం టుస్సాడ్” వారు తమ మ్యూజియం లో ఏర్పాటు చేస్తుంటారు. ఇది వరకు లండన్ లోనే ఈ మ్యూజియం ఉండేది. ఇప్పుడు న్యూయార్క్, బ్యాంకాక్, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మనదేశానికి చెందిన గాంధీజీ, నరేంద్ర మోడీ, సచిన్, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల విగ్రహాలు ఉన్నాయి. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్రలో మైనపు బొమ్మను కూడా మేడం టుస్సాడ్ ప్రతినిధులు ఏర్పాటుచేశారు. తాజాగా మేడం టుస్సాడ్స్‌లో సన్నీలియోన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం ముందు సంతోషంతో సన్నీలియోన్ ఫోజులు ఇచ్చింది. “నా విగ్రహాన్ని చూస్తే ఆనందంగా ఉంది. ఈ విగ్రహాన్ని సరియైన షేప్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంతో మంది శ్రమపడ్డారు.
వారందరికీ అభినందనలు” అంటూ తన సంతోషాన్ని సన్నీ వ్యకతం చేసింది. అయితే ప్రతిమతో సన్నీ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు, నెటిజనులు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. జోకులు కూడా పేలుస్తున్నారు. సన్నీలియోన్ కంటే ఆమె విగ్రహమే మరింత హాట్ గా ఉందని చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్ పెరిగి మైనం కరిగిపోతుందేమో చూసుకోండి.. అంటూ జోకులు వేస్తున్నారు. ఆ గదిలో ఉన్న ఇతర మైనపు ప్రతిమల పరిస్థితి ఏంటో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సన్నీ లియోన్ ప్రతిమ ఏర్పాటుతో “మేడం టుస్సాడ్” మ్యూజియం కి ఉండే విలువ పోయిందని విమర్శిస్తున్నారు.