Sunny Leone: షూటింగ్‌లో గాయపడడంతో సన్నీ లియోన్ కంటతడి.. వైరల్ అవుతున్న వీడియో..!

సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.. శృంగార దేవతగా, కుర్రాళ్ల కలల రాకుమారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా బాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసి అక్కడ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం కాల్షీట్స్ ఖాళీ లేనంత బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ నటించింది. ఇటీవల మంచు విష్ణు పక్కన ‘జిన్నా’ మూవీలో ఆడిపాడింది. భర్త, ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలతో కలిసి ఉంటున్న సన్నీ ఆమధ్య తన పెదానికి దెబ్బ తగిలిందని చెప్తూ..

మొబైల్ ఫిల్టర్స్ వాడుతూ ఓ వీడియో షేర్ చేసి.. తర్వాత అదంతా ఉత్తుత్తినే అని చెప్పింది. ఇప్పుడు నిజంగానే సన్నీ కాలికి గాయమైంది. షూటింగ్ స్పాట్‌లో కాలి బొటన వేలికి దెబ్బ తగలడంతో టీం మెంబర్స్ ఫస్ట్ ఎయిడ్ చెయ్యబోతుండగా.. చిన్న పిల్లలా భయపడిపోతూ ఏడుపు ముఖం పెట్టేసింది. రీసెంట్‌గా ఆ వీడియో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 54.4 మిలియన్ల మంది సన్నీని ఫాలో అవుతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus