మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్..!

  • May 6, 2016 / 06:56 AM IST

పోటుగాడు చిత్రంలో టీచర్ పాత్రలో నటించి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నటించనుంది. నవీన్ చంద్ర కథానాయకుడుగా నూతన దర్శకుడు సంజీవ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న బుర్రకథ అనే చిత్రంలో సన్నీని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ తెలుగులో పలు చిత్రాల్లో నటించడానికి ఆమెకు అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆమె సదరు చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు సంజీవ్ చెప్పిన కథ ఆమెకు నచ్చడంతో ఈ చిత్రంలో ఆమె నటించడానికి ఒప్పుకున్నార’ని చిత్ర బృందం లోని సభ్యుడొకరు తెలిపారు.

ఈ చిత్రంలో నవీన్ సరసన నందిత శ్వేత జంటగా నటిస్తుండగా.. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఆమెకు బాలీవుడ్లో పలు చిత్రాల్లో అవకాశాలు వస్తునప్పటికీ.. తనపై ఉన్న పోర్న్ స్టార్ ముద్రను తొలగించుకునేందుకు ఆమె ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus