బాలయ్యతో సన్నీలియోన్!

బాల‌య్య కోసం క్రిష్‌.. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి స్ర్కిప్టుని సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుందని సమాచారం. కాగా ఈ సినిమాలో ఓ వ్యాంప్ క్యారెక్టర్ ఉంద‌ట‌. ఇందుకోసం స‌న్నీలియోన్ అయితే ఎలా ఉంటుందా.. అని చిత్ర‌బృందం ఆలోచనలో ఉంది. సన్నీకి తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇది వరకు కరెంట్ తీగ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో స‌న్నీ క‌నిపించింది కొంచెం సేపే అయినా.. మంచి అప్లాజ్ వ‌చ్చింది. అందుకే.. బాల‌య్య వంద‌లోనూ స‌న్నీతో ఓ పాత్ర చేయిస్తే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. మరి సన్నీ దీనికి ఒప్పుకుంటుందో.. లేదో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus