Bigg Boss 5 Telugu: సన్నీ రవి గేమ్ ని ముందే కనిపెట్టేస్తున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ అంటేనే ట్విస్ట్ లపైన ట్విస్ట్ లు ఉంటాయి అందులోనూ టాస్క్ లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారు అనేది కూడా ఊహించలేని పరిస్థితి. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఒక్కోసారి ముందు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుంటారు. అయితే, హౌస్ మేట్స్ మాత్రం గేమ్ ని చాలా స్మార్ట్ గా ఎనలైజ్ చేస్తుంటారు. ఇందులో భాగంగా సన్నీ రవి గేమ్ ని ఎనలైజ్ చేస్తూ మాట్లాడాడు.

అంతేకాదు, కాంట్రవర్సీ మాటలు కూడా మాట్లాడాడు. బిబి బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో రవికి స్పెషల్ బొమ్మ దొరకడం , అందులో వేరే టీమ్ చేసిన బొమ్మలు లాక్కోవచ్చని ఉండటాన్ని సన్నీ ఎనలైజ్ చేశాడు. రవి ఆల్రెడీ టాస్క్ ల గురించి బాగా తెలుసు అని, అందుకే చాలా కామ్ గా కూల్ గా టాస్క్ లో ఆడాడు అని అన్నాడు సన్నీ. దీనికి మానస్ ఆన్సర్ షీట్ ముందే తెలుసుకుని వచ్చాడని ఎనలైజ్ చేశాడు. అంతేకాదు, అందరూ బొమ్మలు ఎక్కువగా కుడుతుంటే తను మాత్రం చాలా నిదానంగా ఉన్నాడని,

ఎప్పుడు స్పెషల్ బొమ్మ వస్తుందా అని దానిపైనే ఫోకస్ ఎక్కువ పెట్టాడని మానస్ తో చెప్పాడు సన్నీ. అసలు రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు అంటూ అడిగాడు. అందుకే వాళ్లు గేమ్ లో చాలా కూల్ గా ఉన్నారని అన్నాడు. అంతేకాదు, పత్తి తీసుకుందాం..ఎగ్రెసివ్ గా కలక్ట్ చేద్దాం అని కూడా ఎక్కడా అనిపించలేదు అన్నాడు సన్నీ. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది దాన్ని గుంజుకుని ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్లని టార్గెట్ చేయచ్చని కూల్ గా ఉన్నాడు అన్నాడు.

అంతేకాదు, ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని అన్నాడు. ​దీంతో ఇప్పుడు సన్నీ చేసిన కామెంట్స్ కాంట్రవర్షల్ అయ్యాయి. నిజంగా ముందుగానే రవికి బిగ్ బాస్ టాస్క్ లు అన్నీ తెలుసా అనేది ఆసక్తిగామారింది. నిజానికి స్పెషల్ గా వచ్చిన బొమ్మలో స్లిప్ ని చూసింది శ్వేత. అప్పటి వరకూ రవి మెటీరియల్ కలెక్ట్ చేయడానికి వెళ్లాడు. జెస్సీ చేతిలోనుంచీ లాక్కున్నాడు రవి అంతే. రవికి నిజంగా అందులో స్లిప్ ఉన్న సంగతి శ్వేత చెప్పేవరకూ తెలీదు. అదీ మేటర్.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus