బిగ్ బాస్ హౌస్ లో ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకునేటపుడు పెద్ద యుద్ధమే జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ నుంచీ గ్యాబేజ్ ని మోస్తున్న సన్నీ ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాడు. నేను మాట్లాడితే ఈఒక్కరోజు సరిపోదు అంటూ మొదలెట్టిన సన్నీ చాలాసేపు ఓపిక పట్టి మరీ పాయింట్ టు పాయింట్ జెస్సీని నిలదీయడం మొదలుపెట్టాడు. సన్నీకి సపోర్ట్ గా మానస్ , కాజల్ ఇద్దరూ కూడా జెస్సీపై విరుచుకుపడ్డారు. నిజానికి మార్నింగ్ నుంచీ ఇదే మూడ్ ని క్యారీ చేస్తున్నాడు సన్నీ. మానస్ వచ్చి నచ్చజెప్పినా కూడ ఎందుకో అదే మూడ్ లో ఉన్నాడు.
స్మిమ్మింగ్ పూల్ దగ్గర ఒంటిరిగా పడుకుని దిగులును మోస్తూ, శ్రీరామ్ గేమ్ ని కామెంట్ చేస్తూ తనలో తాను చాలాసేపు మాట్లాడుకున్నాడు. శ్రీరామ్ ఓడిపోయావ్ అన్న మాటలని, జెస్సీ సంచాలక్ గా తీస్కున్న డెసీషన్స్ ని జీర్ణించుకోలేకపోతున్నాడు సన్నీ. మానస్ ని ఎలిమినేట్ చేసినందుకు జెస్సీపై పీకలదాకా కోపంతో ఉన్నాడు. అంతేకాదు, జెస్సీ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని హౌస్ మేట్స్ ఎవ్వరూ ఎందుకు చెప్పట్లేదు అని కూడా ఫీల్ అయ్యాడు. ఇక శ్రీరామ్ అన్నమాటల్ని కూడా చాలా పర్సనల్ గా తీస్కున్నాడు సన్నీ.
ఇవన్నీ మైండ్ లో తిరుగుతున్నప్పుడే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమని అడిగాడు. కేవలం సన్నీని మాత్రమే కాదు, సంచాలక్ అయిన జెస్సీని, గేమ్ లో సన్నీకి ఎదురుతిరిగిన శ్రీరామ్ ని సైతం కన్ఫెషన్ రూమ్ లో రీజన్స్ అడిగాడు బిగ్ బాస్. అయితే, అక్కడ ఎవరూ కూడా బిగ్ బాస్ ని కానీ, టాస్క్ ని కానీ ప్రశ్నించలేదు. అలాగే సన్నీ కూడా జెస్సీ సంచాలక్ గురించి చెప్పలేదు. జెస్సీ మాత్రం నా నిర్ణయం కొంతమందికి నచ్చలేదని, వాళ్లు అనే సూటిపోటి మాటల్ని నేను తీస్కోలేకపోతున్నాను అని చెప్పాడు.
నిజానికి ఇక్కడే వాయిర్ రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ మాట్లాడలేదు. కానీ, వరెస్ట్ పెర్ఫామర్ ఇచ్చినపుడు మాత్రం ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాట్లాడారు. నిజానికి జెస్సీ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు. ఈవిషయాన్ని అతను ఒప్పుకోలేకపోతున్నాడు. నాకు జెన్యూన్ అనిపించింది నేను చేశానని సమర్ధించుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సన్నీ నీ డెసీషన్ నచ్చలేదు అంటూ జెస్సీపైన కోపం ప్రదర్శించాడు. ఇక్కడే జెస్సీ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు. ఆర్గ్యూమెంట్ కాకుండా సింపుల్ గా పరిష్కరించుకోవాల్సింది. అందులో ఇద్దరూ విఫలం అయ్యారు.
ఇక్కడ తప్పు కాల్తో బస్తాని తన్నినందుకు సన్నీదీ ఉంది, అలాగే సంచాలక్ గా క్విక్ డెసీషన్ తీస్కుని ఎలిమినేట్ చేయలేకపోయిన జెస్సీది ఉంది. అయితే, జెస్సీకి హౌస్ లో సపోర్టింగ్ గా సిరి, షణ్ముక్ , రవి ఉన్నారు. అంతేకాదు, శ్రీరామ్ కూడా నీ డెసీషన్ నువ్వు తీస్కున్నావ్ తప్పేంలేదు అన్నట్లుగానే మాట్లాడాడు. దీనికి వీకెండ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరం.