తెలుగమ్మాయిపై పడిన సూపర్ స్టార్ ఫ్యాన్స్

నిన్నటివరకూ ఈ ఏడాది హిట్స్ సాధించిన లిస్ట్ లో “భరత్ అనే నేను” సినిమా పేరు చెప్పనందుకు అక్కినేని నాగార్జునపై ట్విట్టర్ దాడి చేసిన కొందరు మహేష్ అభిమానులు ఇప్పుడు తమ కాన్సన్ ట్రేషన్ ను “గూఢచారి”తో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన శోభిత ధూళిపాళవైపు మరళించారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ ఏం జరిగింద్రా అంటే.. ఇటీవల మహేష్ బాబు “గూఢచారి” చిత్రాన్ని చూసి సినిమా చాలా బాగుంది అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ ట్వీట్ కు రిప్లై గా శోభిత ధూళిపాళ చాలా సింపుల్ గా “థ్యాంక్స్” అని పేర్కొనడం ఇప్పుడు మహేష్ అభిమానుల ఆగ్రహానికి ఆహుతయ్యింది.

మహేష్ లాంటి సూపర్ స్టార్ మీ సినిమా బాగుంది అని మెచ్చుకోవడమే కాకుండా ప్రమోట్ చేస్తుంటే.. కనీసం రెస్పెక్ట్ లేకుండా సింపుల్ గా థ్యాంక్స్ చెబుతావా అంటూ ఆమెపై ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు జనాలు. మొన్నటివరకూ నాగార్జున, ఇప్పుడేమో శోభితల ఇష్యూ కారణంగా “గూఢచారి” ఏదో ఒక రకంగా ట్విట్టర్ లో ట్రెండు అవుతూనే ఉంది. దాంతో.. ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉన్నా.. సినిమాకి పబ్లిసిటీ వస్తుంది కదా అని మేకర్స్ కూడా సైలెంట్ గా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus