Prabhas: సాహో తప్పు రాధేశ్యామ్ లో చేయలేదట!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా వేర్వేరు రీజన్స్ వల్ల వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సంక్రాంతికి ప్రభాస్ ఖచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ లో మాత్రం ఈ పాత్రలో మిథున్ చక్రవర్తి కానిపిస్తారని సమాచారం.

సాహో సినిమా రిలీజైన సమయంలో ఆ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కు తగినట్టుగా ఉందనే కామెంట్లు వినిపించాయి. టాలీవుడ్ నటులకు ఆ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. రాధేశ్యామ్ మూవీ విషయంలో ఆ మిస్టేక్ పునరావృతం కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు రాధేశ్యామ్ పై రోజురోజుకు అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా రాధేశ్యామ్ హిందీ వెర్షన్, సౌత్ వెర్షన్ లలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది.

తెలుగు నేటివిటీకి తగిన విధంగానే సౌత్ వెర్షన్ ఉండటం ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి. బాహుబలి2 స్థాయి సక్సెస్ ను ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో సాధించాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ లో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు. వచ్చే నెల నుంచి రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus