మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమాని భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాండ్ గా తీస్తున్నారు. అదేవిధంగా బాహుబలి వంటి సక్సెస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా కూడా బడ్జెట్ విషయంలో రాజి పడకుండా చాలా రిచ్ గా తీస్తున్నారు. అయితే ఇటీవలే రిలీజ్ అయినా బాలీవుడ్ సినిమా ‘థగ్స్ అఫ్ హిందూస్తాన్’ భారీ తారాగణంతో ఒక రేంజులో ఎక్సపెక్ట్షన్స్ తో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తీసిన, ఎంత గొప్ప నటులు అందులో నటించిన కథలో సత్తాలేకుండా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మాకు ఒకటే అని ప్రేక్షకులు మరొకసారి ఈ సినిమాతో రుజువు చేసారు.
ఇక ఈ సినిమా రిజల్ట్ తో ‘సైరా’, ‘సాహో’ సినిమాలు కొంచం అలెర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తే పెట్టింది రాబట్టడం చాలా కష్టం, అందుకే ఈ సినిమా మేకర్స్ ఎలాంటి హడావుడి వద్దని రిలీజ్ డేట్ లేట్ అయినా పర్వాలేదని, కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని భావిస్తున్నారట. ఇలా ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసిన చివరకు రిజల్ట్ మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది మరి.