టాలీవుడ్‌లో నాగార్జున గురించి పొగడమంటే మన్మథుడు, బాస్ అని ఇప్పటితరం అంటే.. నిన్నటి తరం మాత్రం యువసామ్రాట్ అంటూ ఆకాశానికెత్తేస్తుంది. అయితే ఆయనలో మరో కోణాన్ని ఆయన మేనకోడలు సుప్రియ యార్లగడ్డ చెప్పారు. ఆ కోణం మనకు తెలియదు అని కాదు కానీ.. ఆయన మంచి నటుడితోపాటు ఇది కూడా అని సుప్రియ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ‘బాయ్స్ హాస్టల్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కన్నడలో విజయవంతమైన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దర’ చిత్రానికి అనువాదం.
ఈ నేపథ్యంలో సుప్రియ (Supriya) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. మంచి సినిమాల్ని విడుదల చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనే ఆలోచనతోనే ‘బాయ్స్ హాస్టల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నామని సుప్రియ చెప్పారు. ఆ సినిమా తమ సంస్థకి మరింత వాల్యూ యాడ్ చేస్తుందని చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అంతేకాదు ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ప్రేక్షకులు మన తెలుగువాళ్లే అంటూ ఆకాశానికెత్తేశారు కూడా.
ఈ సినిమా గురించి తెలియగానే తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నాం. అయితే రీమేక్ చేస్తే ఆ ఫీల్ రాదనిపించింది. అదుకే డబ్బింగ్ చేసి, కొన్ని సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. రష్మి, తరుణ్ భాస్కర్‌పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించి తెలుగు దనం కనిపించేలా ప్రయత్నం చేశాం అని చెప్పారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాలు తగ్గిపోయాయి అనే మాటలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. ఏడాదికి ఒక సినిమా చేస్తూనే ఉన్నాం.
కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీసే విధానంలోనే మార్పొచ్చింది. ఒక బృందం ఒక సినిమానే చేయగలుగుతోంది అని చెప్పారు. ఈ కారణంతోనే ఇప్పుడు నిర్మాణ సంస్థలు కలసి ముందుకెళ్తున్నాయి. నాకు తెలిసి నాగార్జున మావయ్య కంటే మంచి నిర్మాత ఎవరూ లేరు అని అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతమురారండి’ సినిమా మొదలుకొని నాగార్జున నిర్మాతగా చాలా అద్భుతాలు చేశారు. మా సంస్థలో నెక్స్ట్ నాగచైతన్య, అఖిల్‌తో సినిమాలు వస్తాయి అని సుప్రియ తెలిపారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్