Surekha Vani: రూమర్స్ అని చెప్పి.. పోస్ట్ డిలీట్ చేసేసిందే!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ ను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఐదో సీజన్ లోగోను విడుదల చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా.. ప్రతి సీజన్ లానే ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ లిస్ట్ లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, టీవీ 9 ప్రత్యూష ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా సురేఖావాణి ఈ విషయంపై స్పందించింది. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది.

అయితే ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే ఆమె పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ షోలోకి వెళ్తుందా..? లేదా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఈ షోను సెప్టెంబర్ 5 నుండి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి కూడా హోస్ట్ గా హీరో నాగార్జున వ్యవహరించనున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus