టాలీవుడ్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈతరం హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను ఆమె ఇక్కడ సంపాదించుకుంది. అలాగే ఈమె కూతురు బండారు సుప్రీత నాయుడు కూడా చాలా ఫేమస్. సురేఖ వాణితో సమానంగా ఈమెకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సుప్రీత ఏ సినిమాలోనూ నటించలేదు అయినప్పటికీ ఈమెకు 4 లక్షల ఫాలోవర్స్ ఉండడం విశేషం. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత.
అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది.వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇటీవల కూడా సుప్రీత అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ నెటిజన్ హద్దులు దాటి ఓ ప్రశ్న అడిగాడు. అందుకు సుప్రీత ఆ నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పి నోరు మూయించింది. వివరాల్లోకి వెళితే.. సుప్రీత లైవ్ సెషన్ లో పాల్గొంటూ ఉండగా.. ఓ నెటిజన్ ‘నువ్వు వర్జినా?’ అంటూ అసభ్యంగా ప్రశ్నించాడు.
దానికి సుప్రీత ఏమాత్రం కృంగిపోకుండా.. ‘వకీల్ సాబ్’ లో ప్రకాష్ రాజ్.. నివేదా థామస్ ను ఆ ప్రశ్న అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా దూసుకువచ్చి విరుచుకుపడతాడో ఆ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది.దాంతో ఆ నెటిజెన్ నోరు మూసుకున్నట్టు అయ్యింది అనే చెప్పాలి. దాంతో ఈమె తల్లి సురేఖావాణి ని మించి డేరింగ్ గా లేడీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!