కూతురి విషయంలో సురేఖ వాణి ప్లాన్ అదేనా?

ఎన్నో సినిమాల్లో తల్లి, వదిన అక్క పాత్రలతో అలరించిన సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 43 ఏళ్ళ వయసులో కూడా వన్నె తగ్గని అందంతో ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..! ఇక ఈమె తన కూతురు సుప్రీత తో చేస్తున్న వీడియోలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిజానికి వీళ్ళు తల్లి కూతుర్లులా కాదు.. అక్కా చెల్లెల్లు లా కనిపిస్తూ ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.

‘మీ కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా?’ అని ఈమెను ఓ సందర్భంలో అడిగితే.. ‘తనకి నటన పై ఇంట్రెస్ట్ లేదు.. ‘ఒకవేళ యాక్టర్ అవుతాను’ అంటే మాత్రం నేను అడ్డు చెప్పను. కచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సురేఖ వాణి తన కూతురితో కలిసి.. సుమ ‘క్యాష్’ ప్రోగ్రామ్ లో సందడి చేసింది. ఈ షోలో సురేఖ మరియు సుప్రీతలు బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆకర్షించారు. ఎలాగూ బుల్లితెరకు తీసుకొచ్చింది.

అలాగే సినిమాల్లోకి కూడా సుప్రీతను పరిచయం చెయ్యాలని సురేఖ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా? అనే అనుమానాలు ఈ షో ద్వారా తెరలేపింది సురేఖా వాణి. మరి సురేఖ మనసులో ఏముందో? తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు. ఇక గతేడాది సురేఖ భర్త దూరమైపోవడంతో.. ఆమె చాలా డిజప్పాయింట్ అయ్యింది. కొన్నాళ్ల పాటు ఆమె ఎక్కడా కనిపించలేదు. ‘కూతురు ఆనందం కోసమే ఈమె మళ్ళీ నార్మల్ అయినట్టు’.. సురేఖనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus