Surekha Vani: నెటిజెన్లకు దిమ్మ తిరిగేలా క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి..!

‘బిగ్ బాస్5’ లోగో ప్రోమోని విడుదల చేయడంతో ‘బిగ్ బాస్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.’బిగ్ బాస్5′ సెప్టెంబర్ 5 నుండీ ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ‘బిగ్ బాస్’ టీం ఎప్పటిలానే ఈ విషయం పై సైలెంట్ గా ఉంది.

ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యే వరకు వాళ్ళు కంటెస్టెంట్ ల పేర్లను రివీల్ చెయ్యరు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్ ల లిస్ట్ లో నటి సురేఖా వాణి పేరు కూడా ఉంది.అందుకోసమే ఆమె మరింతగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నట్టు డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. అయితే వీటి పై సురేఖ మండిపడుతూ స్పందించింది. “మీకు చేతులెత్తి దండం పెడుతున్నా .. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపండి.

నేను ‘బిగ్ బాస్’ షోకి వెళ్లడం లేదు.మీకు నచ్చినట్టు ఇలా ఈ టాపిక్ ను స్ప్రెడ్ చేయడం మూలాన చాలా మంది స్నేహితులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం తనకి ఇష్టం లేదన్నట్టు సురేఖ వాణి చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus