నెటిజనులు వేడుకుంటున్న నటి సురేఖ వాణి
- November 14, 2016 / 08:46 AM ISTByFilmy Focus
బుల్లి తెరపైన విభిన్నమైన షోలతో ఓ వెలుగు వెలిగి, వెండి తెరపై హోమ్లీ పాత్రల్లో ఆకట్టుకుంటున్న నటి సురేఖ వాణి. విజయవాడకు చెందిన ఈమె సినిమాల్లో చీరకట్టుతో చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది. రియల్ లైఫ్ లో మాత్రం లేటెస్ట్ ఫ్యాషన్ డ్రస్సులను వేస్తుంది. రెండు నెలల క్రితం నెట్లో హల్ చల్ చేసిన వీడియో ఈ విషయాన్నీ అందరికీ కళ్లకు కట్టింది. సురేఖ తన కూతురు సుప్రీతతో కలసి ఇంట్లో కాలా చష్మా మ్యూజిక్ కు సరదాగా డ్యాన్స్ వేసింది. ఇందులో తల్లీ కూతుళ్లు మినీ షార్ట్ వేసుకొని అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియో విపరీతంగా లైకులు, షేర్లు అందుకుంది.
ఈ వీడియో నెట్లో పెట్టారని సురేఖ వాణికి తెలియదంట. కొన్ని రోజుల క్రితం తన డ్యాన్స్ వీడియోని చూసుకున్న ఈ నటి కంగారుపడిందంట. వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయమని సదరు వెబ్ సైట్ నిర్వాహకులను కోరుతోంది. సురేఖ వాణి లేట్ గా మేల్కోవడంపై పరిశ్రమలో మిశ్రమ స్పందన వస్తోంది. ఆ వీడియో వల్ల ఆమెకు అవకాశాలు తగ్గుతుండడంతో వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం .. ఆ వీడియోని అందరూ చూడాలని ఈ ట్రిక్ ప్లే చేస్తోందని విమర్శిస్తున్నారు. అసలు నిజం సురేఖ వాణి కే తెలియాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












